Sara Ali Khan: జిమ్లో బాలీవుడ్ ముద్దుగుమ్మల కష్టాలు.. పోటీ పోటీగా వర్కవుట్స్ .. వీడియో వైరల్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా, శిల్పాశెట్టి వంటి సీనియర్ హీరోయిన్స్ యోగా చేస్తూ తమ ఫిట్ నెస్ ఎలా మెయిన్ టైన్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇక దిశా పటానీ, కత్రినా కైఫ్, దీపికా పదుకొణే వర్కవుట్స్, బాక్సింగ్, మార్షన్ ఆర్ట్స్ చేస్తూ బాడీని అందంగా మెయింటెన్ చేస్తుంటారు. అలాగే జాన్వీ, సారా అలీ ఖాన్, లైగర్ బ్యూటీ అనన్య సైతం జిమ్ లో ఎక్కువగా కష్టపడుతుంటారు. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే సారా పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయ్యి.. కఠినమైన వర్కవుట్స్ ఎన్నో చేసి ఇప్పుడు సన్నజాజి తీగలా మారింది.

హీరోయిన్ అంటే.. అందం, అభినయం మాత్రమే కాదు.. ఫిట్నెస్ ముఖ్యమే. ఇప్పుడున్న సినీతారలు ఈ విషయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో కావడం.. రోజూ జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా, శిల్పాశెట్టి వంటి సీనియర్ హీరోయిన్స్ యోగా చేస్తూ తమ ఫిట్ నెస్ ఎలా మెయిన్ టైన్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇక దిశా పటానీ, కత్రినా కైఫ్, దీపికా పదుకొణే వర్కవుట్స్, బాక్సింగ్, మార్షన్ ఆర్ట్స్ చేస్తూ బాడీని అందంగా మెయింటెన్ చేస్తుంటారు. అలాగే జాన్వీ, సారా అలీ ఖాన్, లైగర్ బ్యూటీ అనన్య సైతం జిమ్ లో ఎక్కువగా కష్టపడుతుంటారు. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే సారా పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయ్యి.. కఠినమైన వర్కవుట్స్ ఎన్నో చేసి ఇప్పుడు సన్నజాజి తీగలా మారింది. అయితే తన జిమ్ వీడియోస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది సారా.
గతంలో తన స్నేహితురాలు జాన్వీతో కలిసి, యోగ, జిమ్ చేస్తున్న వీడియోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. వీరిద్దరు చాలాకాలంగా కలిసే జిమ్ వర్కవుట్స్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు సారా మరో హీరోయిన్ అనన్యతో కలిసి జిమ్ లో కష్టపడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో సారా, అనన్య చెమటలు చిందిస్తూ వర్కవుట్స్ చేస్తున్నారు. ఫిట్ నెస్ విషయంలో బాలీవుడ్ తారల పట్టుదల చూసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సారా, అనన్య జిమ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
View this post on Instagram
లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. మరోవైపు సారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ తెలుగు సినిమా అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.