TOP 9 ET: పెళ్లి కార్డే ఇలా ఉంటే..పెళ్లి ఏ రేంజ్‌లో జరుగుతుందో.? | అదిరిపోయిన మెగాస్టార్ లుక్.
రీ-రిలీజ్‌ల ట్రెండ్ నెమ్మదిగా తగ్గుతుంది.. వాటిపై క్రేజ్ కూడా పడిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఏదో ఒక సినిమా వచ్చి మళ్లీ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ఆ మధ్య ఈ నగరానికి ఏమైంది సినిమా టైమ్‌లో అంతే. తాజాగా మరో సినిమా కూడా వచ్చేస్తుంది. అదే శంకర్ దాదా ఎంబిబిఎస్. చిరంజీవి కెరీర్‌లో కల్ట్ కామెడీగా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.
01.Varun TeJ
ఇండస్ట్రీనే కాదు.. తెలుగు టూ స్టేట్స్ మొత్తం ఇప్పుడు ఒకే వీడియోను చూస్తోంది. అదే వరుణ్ – లావణ్యల పెళ్లి కార్డ్ వీడియో..! చాలా గ్రాండ్‌గా.. భారీగా.. లావిష్‌గా ఉన్న ఈ మెగా సెలబ్ కపుల్ పెళ్లి కార్డ్.. అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. కార్డే ఇంత గ్రాండ్‌గా ఉంటే.. నవంబర్ 1న .. ఇటలీలో జరిగే వీరి పెళ్లి ఇంకెత గ్రాండ్‌గా జజరుగుతుందో అని అందరూ ఆలోచించుకునేలా చేస్తోంది.
02.MegaStar Look
ఆఫ్టర్ భోళా శంకర్ డిజాస్టర్ టాక్.. చిరు చేస్తున్న 156th ఫిల్మ్ సంబంధించిన ఓ ఫాడ్ మేడ్ లుక్ ఇప్పుడందర్నీ స్టన్ అయ్యేలా చేస్తోంది. మైతలాజికల్ జోనర్లో.. వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అప్పుడే విపరీతమైన అంచనాలు పెరిగేలా చేస్తోంది. అన్నట్టు.. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పరీశీలనతో ఉంది. ఇక దీన్ని కూడా.. ఫ్యాన్స్ … వారు డిజైన్ చేసిన పోస్టర్స్‌లో కోట్ చేశారు.
03.Shankar Dada
రీ-రిలీజ్‌ల ట్రెండ్ నెమ్మదిగా తగ్గుతుంది.. వాటిపై క్రేజ్ కూడా పడిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఏదో ఒక సినిమా వచ్చి మళ్లీ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ఆ మధ్య ఈ నగరానికి ఏమైంది సినిమా టైమ్‌లో అంతే. తాజాగా మరో సినిమా కూడా వచ్చేస్తుంది. అదే శంకర్ దాదా ఎంబిబిఎస్. చిరంజీవి కెరీర్‌లో కల్ట్ కామెడీగా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.
04.Tillu 2
డీజే టిల్లు.. ఈ సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డ రేంజ్ రాత్రికి రాత్రే పెరిగిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేయడంతో ప్రస్తుతం దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టిల్లు స్వ్కేర్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు. ఫిబ్రవరి 9న విడుదల కానుంది ఈ చిత్రం.
05. Surya 43
సూర్య వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈయన కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను ప్రకటించారు సూర్య. తనకు ఆకాశం నీ హద్దురా లాంటి క్లాసిక్ ఇచ్చిన దర్శకురాలు సుధా కొంగరతో నెక్ట్స్ సినిమా చేయబోతున్నారీయన. ఇందులో సూర్యతో పాటుగా దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫహద్, విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
06.Polimera 2
రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం అందుకున్న ‘మా ఊరి పొలిమేర’. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసారు దర్శక నిర్మాతలు. కమెడియన్‌గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా మారారు. నవంబర్ 3న పొలిమేర 2 విడుదల కానుంది. తాజాగా ఇందులో కారెక్టర్ ఇంట్రోస్ టీజర్స్ రిలీజ్ చేసారు మేకర్స్.
07.Animal
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1న విడుదల కానుంది ఈ సినిమా. తాజాగా ఇందులోని రెండో పాటను విడుదల చేసారు మేకర్స్. నే వేరే అంటూ సాగే పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
08.Kamal Haasan
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 33 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు మణిరత్నం. అలాగే విక్రమ్‌తో కమల్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈయన ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను ప్రకటించారు కమల్ హాసన్.
09.The Railway Man
యష్ రాజ్ ఫిలిం, నెటిఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ది రైల్వే మేన్. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 18న డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

