Anchor Suma: సుమ లైన్ క్రాస్ చేసిందా – నెటిజన్స్ ఏమంటున్నారంటే..?
ఆదికేశవ మూవీ ప్రెస్ మీట్ లో మీడియావాళ్లు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారంటూ తాను చేసిన కామెంట్స్ పై సుమ స్పందించింది. మీ కుటుంబ సభ్యురాలిగా భావించి నన్ను క్షమించండి అంటూ మీడియాకు యాంకర్ సుమ క్షమాపణ చెప్పింది. మీరు, నేను కలిసి ఎన్నో ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నాం. మీ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని భావిస్తున్నాను అని సుమ ఆ వీడియోలో మాట్లాడింది.
ఆదికేశవ మూవీ ఫంక్షన్‌లో పాల్గొన్న సుమ.. “ఈవెంట్లో పెట్టిన స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు. తొందరగా లోపలికి వచ్చి..మీమీ కెమెరాలను ఇక్కడ పెట్టండి” అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. దీంతో కొందరు జర్నలిస్టులు నొచ్చుకున్నారు. ఆ మాట తమకు ఇబ్బందికరంగా అనిపించిందని ఓ జర్నలిస్ట్ సుమకు తెలియజేశారు. దీంతో సుమ సారీ చెప్పారు. తాను జోక్ చేసినట్లు తెలియజేశారు. “మీడియా మిత్రులందరికీ నమస్తే.. నా మాటలు బాధ కలిగించి ఉంటే చాలా సారీ. ఇలా అనడం నా ఉద్దేశం కాదు. నిండు మనసుతో అందరినీ క్షమాపణ కోరుతున్నాను” అని ప్రత్యేకంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వగా..సుమ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ..సుమ గారు ఎవరినీ హర్ట్ చేయరని ఏదో ప్లోలో ఆ మాట వచ్చిందని చెబుతున్నారు. ఆమె పొరపాటును గ్రహించి.. హుందాగా సారీ చెప్పిందని అంటున్నారు. కొందరు నెటిజన్స్ మాత్రం ఆమె లైన్ క్రాస్ చేసిందని కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

