Actor Salman Khan: వారికి క్షమపణలు చెప్పిన సల్మాన్ ఖాన్.. అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడుగా..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశాపటానీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రాధే'. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశాపటానీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధే’. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని ఏడాది ప్రారంభంలో థియేటర్ల యాజమానులు సల్మాన్‌ను కోరారట. అందుకు సల్మాన్ సానుకూలంగా స్పందించాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు సల్లూభాయ్.
ఈ మేరకు తన ఇన్ స్టాలో..”ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంత కాలం తీసుకున్నందుకు క్షమించాలి. ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లు పడుతున్న ఇబ్బందుల గురించి నాకు తెలుసు. ప్రస్తుత పరిస్థితులలో రాధే సినిమాను థియేటర్లలో విడుదల చేసి వారికి సహయం చేయాలనుకుంటున్నాను. కానీ వీరు నాకు ప్రతిఫలంగా థియేటర్లలోకి వచ్చిన వారికి కోసం పలు జాగ్రత్తలు పాటించాలి. ఈ ఈద్‌కు థియేటర్లలో రాధే సినిమాను విడుదల చేయండి”.. అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటికే రాధే చిత్రాన్ని రూ.230 కోట్లకు జీ 5 కొనుగోలు చేసింది. అలాగే శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుంది. కానీ థియేటర్ల ఓనర్ల కోరిక మేరకు ముందుగా థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
Also Read:
అల్లు అర్జున్ డ్యాన్స్‌కి బాలీవుడ్ హీరో ఫిదా.. నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను అంటున్న స్టార్..