AR Rahman: సెట్‏లో పెను ప్రమాదం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఏఆర్ రెహమాన్ తనయుడు..

|

Mar 06, 2023 | 5:30 PM

ప్రమాదానికి సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపుతూ ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం తాను ఇలా జీవించి ఉన్నందుకు ఆ దేవుడికి.. తల్లిదండ్రులకు.. స్నేహితుల ఆశీర్వాదం వల్లే అన్నారు అమీన్.

AR Rahman: సెట్‏లో పెను ప్రమాదం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఏఆర్ రెహమాన్ తనయుడు..
Ar Rahman, Ar Ameen
Follow us on

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ప్రముఖు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇటీవల ముంబైలో ఓ షూటింగ్ సెట్‏లో పెను ప్రమాదం జరిగింది. రెహమాన్ కొడుకు అమీన్ లైవ్ ఇస్తున్న సమయంలో ఓ షాన్డిలియర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో తృటిలో అమీన్ ప్రాణాలతో బయటపడగా.. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపుతూ ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం తాను ఇలా జీవించి ఉన్నందుకు ఆ దేవుడికి.. తల్లిదండ్రులకు.. స్నేహితుల ఆశీర్వాదం వల్లే అన్నారు అమీన్.

“నా టీంతో కలిసి ఓ మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా.. క్రేన్ కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు..భారీ లైట్లు కిందపడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను వాటికి కొద్ది దూరంలోనే ఉన్నాను. పైనుంచి కిందపడిన వాటిలో ఓ భారీ షాండిలియర్ కూడా ఉంది. ఏ మాత్రం కాస్త్ అటు ఇటు అయినా అవి మా తలపై పడేవి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన షాక్ నుంచి ఇప్పటికీ మేము తేరుకోలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు, ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్లే ఈరోజు నేను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. లేదంటే ఏం జరిగి ఉండేదో” అంటూ రాసుకొచ్చారు. ఇక తనయుడి ఘటనపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

“ఇటీవల కొద్ది రోజుల క్రితం నా కుమారుడు ఏఆర్ అమీన్.. అతని టీం పెద్ద విపత్తు నుంచి తప్పించుకున్నారు. ఆ దేవుడి దయ వలన ఇటీవల ముంబైలోని ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదంలో వీరికి ఎలాంటి గాయలు కాలేదు. ఈ ఘటనపై ఇన్సురెన్స్ కంపెనీ, నిర్మాణ సంస్థ గుడ్ పెల్లాస్ స్టూడియోస్ పై దర్యాప్తు జరుగుతుంది ” అని రెహమాన్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.