Athiya Shetty- KL Rahul: కేఎల్ రాహుల్- అతియాల గొప్ప మనసు.. వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతోన్న పిల్లల కోసం..
బాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అతియా శెట్టి- కేఎల్ రాహుల్‌ల జోడీ ఒకటి. పెళ్లికి ముందు చాలా రోజుల పాటు ప్రేమలో గడిపిన ఈ జంట 2023, జనవరి 23న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది అతియా శెట్టి. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయారు
బాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అతియా శెట్టి- కేఎల్ రాహుల్‌ల జోడీ ఒకటి. పెళ్లికి ముందు చాలా రోజుల పాటు ప్రేమలో గడిపిన ఈ జంట 2023, జనవరి 23న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది అతియా శెట్టి. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా తన భర్తతో కలిసి ఓ ఛారిటీ సంస్థను నెలకొల్పింది అతియా శెట్టి. విప్లా ఫౌండేషన్ కోసం నిధులు, విరాళాలను సేకరించేందుకు ‘క్రికెట్ ఫర్ ఎ కాజ్’ పేరుతో ఒక ఛారిటీని ప్రకటించారీ క్యూట్ కపుల్. ముంబయిలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్‌గా మార్చారు. ఇప్పుడీ సంస్థ కోసమే మరికొందరు క్రికెటర్లతో కలిసి ఛారిటీ తరఫున నిధులు సేకరించనున్నారు అతియా- కేఎల్ రాహుల్. ఇందుకోసం ప్రత్యేకంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ నిధులను వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం వినియోగించనున్నారు.
ఈ వేలంలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, రాహుల్ ద్రవిడ్ తదితర క్రికెటర్లు భాగం కానన్నారు. ఈ వేలంలో పాల్గొని తమకు నచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. దీనిని దివ్యాంగుల పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోన్న విప్లా ఫౌండేషన్ కు అందించనున్నారు రాహుల్-అతియా.
భారత క్రికెటర్లతో కలిసి..
View this post on Instagram
కేఎల్ రాహుల్- అతియా శెట్టి నిర్వహించనున్న ఈ ఛారిటీ వేలంలో భారత క్రికెటర్లతో పాటు జాస్ బట్లర్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ లాంటి విదేశీ స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. దీని గురించి తెలిసిన అభిమానులు, నెటిజన్లు రాహుల్- అతియాల సేవా గుణాన్ని మెచ్చుకుంటున్నారు. పిల్లల కోసం చాలా గొప్ప పని చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టిల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.