AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాపై కొడవ కమ్యునిటీ ఆగ్రహం.. ఎందుకంటే..

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. అయినప్పటికీ ఈ హీరోకు ఆఫర్స్ మాత్రం తగ్గట్లేదు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్కై ఫోర్స్. ఈ సినిమా శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చింది.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాపై కొడవ కమ్యునిటీ ఆగ్రహం.. ఎందుకంటే..
Sky Force
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2025 | 9:38 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటేస్ట్ మూవీ స్కై ఫోర్స్. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆక్టటుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య పాత్రపై కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ దేవయ్యను తమిళుడిగా చిత్రీకరించడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అతను కర్ణాటకలోని కొడగులో కొడవ కమ్యూనిటీకి చెందిన అధికారి అని.. కానీ సినిమాలో మాత్రం అతడిని తమిళుడిగా చూపించారని మండిపడ్డారు. కొడవ కమ్యూనిటీ అనేది కర్ణాటకలోని కూర్గ్ (ప్రస్తుతం కొడగు)లో ఉన్న ఒక జాతి సంఘం. వారు యుద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. కమ్యూనిటీకి చెందిన న్యాయవాది తాన్య వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆమె ఆమె స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య సమాజాన్ని తప్పుగా చిత్రీకరించడం వెనుక చిత్రనిర్మాతల ఉద్దేశాలను ప్రశ్నిస్తూ ప్రత్యేక వీడియో చేసింది.

స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య గుర్తింపును చిత్రనిర్మాతలు తప్పుగా చిత్రీకరిస్తున్నారని సోషల్ మీడియాలో మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవయ్యను తమిళుడిగా చూపించారని.. కానీ అతడు కొడవ వర్గానికి చెందిన వ్యక్తి అని.. అతడి గుర్తింపును పూర్తిగా మార్చారంటూ మండిపడ్డారు. స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య మరణానంతరం మహావీర చక్ర అవార్డు పొందిన ఏకైక భారతీయ వైమానిక దళ అధికారి. స్క్వాడ్రన్ లీడర్ దేవయ్యపై అదే వర్గానికి చెందిన నటుడు గుల్షన్ దేవయ్య లైట్ విసిరారు.

ఫీల్డ్ మార్షల్ KM కరియప్ప, భారతదేశపు మొదటి సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్, భారత సైన్యం మూడవ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ KS తిమ్మయ్య కొడవ కమ్యూనిటీకి చెందినవారు. శుక్రవారం నాడు థియేటర్లలో విడుదలైంది. 1965 యుద్ధంలో పాకిస్తాన్‌లోని సర్గోధా వైమానిక స్థావరంపై భారతదేశం చేసిన మొదటి వైమానిక దాడి, నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య ధైర్యసాహసాలను చూపించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్ మరియు నిమ్రత్ కౌర్ నటించారు. ఈ సినిమా మొదటి రోజున రూ.11.25 కోట్లు రాబట్టింది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..