Shefali Jariwala: గుండెపోటుతో హీరోయిన్ మృతి.. షాక్‏లో ఇండస్ట్రీ..

సినీపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కాంటా లగా సాంగ్ ఫేమ్.. నటి షఫాలీ జరివాలా గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు.

Shefali Jariwala: గుండెపోటుతో హీరోయిన్ మృతి.. షాక్‏లో ఇండస్ట్రీ..
Shefali Jariwala

Updated on: Jun 28, 2025 | 6:53 AM

హిందీలో సూపర్ హిట్ అయిన కాంటా లగా పాటలతో ఫేమస్ అయిన నటి షెఫాలి జరివాలా గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. ముంబైలోని అంధేరి లోఖండ్‌వాలా ప్రాంతంలో నివసించే నటి షెఫాలి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే షెఫాలి మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. షెఫాలి మరణ వార్తతో ఇండస్ట్రీలోని సినీప్రముఖులు షాక్‏కు గురయ్యారు. ఆమె మృతి పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

షెఫాలీ జరివాలా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె అహ్మదాబాద్‌లో జన్మించింది. 2002 సంవత్సరంలో ఆశా పరేఖ్ చిత్రంలోని కాంటా లగా పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ పాటను ముజ్సే షాదీ కరోగి చిత్రంలో ఉపయోగించారు. ఇప్పటికీ ఈ పాటకు యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట హిట్ కావడంతో షెఫాలిని అభిమానులు ముద్దుగా కాంటా లగా గర్ల్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 13లోనూ షెఫాలి పాల్గొంది. అలాగే ముజ్సే షాదీ కరోగి సినిమా తర్వాత హిందీలో ఆమె మరో సినిమా చేయలేదు.

ఇవి కూడా చదవండి

కానీ కన్నడలో హుడుగారు అనే సినిమాలో కనిపించింది. సినీరంగంలో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న షెఫాలి.. ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు అభిమానులు సైతం షాక్ కు గురవుతున్నారు. షెఫాలి మరణం పట్ల గాయని మికా సింగ్ విచారం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..