Jaya Bachchan: ఆస్తుల వివరాలను ప్రకటించిన జయాబచ్చన్‌.. అమితాబ్ ఫ్యామిలీకి మొత్తం ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

|

Feb 15, 2024 | 11:51 AM

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆమె నటనతో పాటు క్రియాశీల రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా ఉంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా సేవందించారు. తాజాగా జయాబచ్చన్‌ మరోసారి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారామె.

Jaya Bachchan: ఆస్తుల వివరాలను ప్రకటించిన జయాబచ్చన్‌.. అమితాబ్ ఫ్యామిలీకి మొత్తం ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
Amitabh Bachchan
Follow us on

బాలీవుడ్ సెలబ్రిటీల ఆస్తుల వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఎవరికీ ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి? ఇళ్లు, వాహనాలు ఇతర స్థిరాస్తుల వివరాలేంటో తెలుసుకునేందుకు తాపత్రయపడుతుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆమె నటనతో పాటు క్రియాశీల రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా ఉంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా సేవందించారు. తాజాగా జయాబచ్చన్‌ మరోసారి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారామె. నామినేషన్ సమయంలో ఇచ్చిన ఆస్తుల వివరాల ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు రూ.1,578 కోట్లు. 022 – 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్‌ నికర విలువ రూ.273.74 కోట్లుగా పేర్కొన్నారు. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉందని తెలిపారు.

 

జయా బచ్చన్‌ దగ్గర రూ.40.97 కోట్ల విలువైన ఆభరణాలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అదే సమయంలో అమితాబ్‌ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తానికి అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్‌ ప్రకటించారు. జయా బచ్చన్‌కి వివిధ వనరుల నుండి డబ్బు వస్తోంది. బ్రాండ్ ప్రమోషన్, MP జీతం, అలాగే సినిమాల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారామె. అలాగే తమ లగ్జరీ బంగ్లాల అద్దెలు, డివిడెండ్, సోలార్ ప్లాంట్ మొదలైన వాటి ద్వారా అమితాబ్‌ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..