AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ఫ్రెండ్స్‌తో కలిసి జాన్వీ కపూర్ ఫన్నీ డ్యాన్స్.. అర్జున్ కపూర్ ఏమని రియాక్ట్ అయ్యారంటే?

Janhvi Kapoor Dance Video: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికలపై తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను రోజురోజుకూ పెంచుకుంటోంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో ఇప్పటికే కోటి 16 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.

Janhvi Kapoor: ఫ్రెండ్స్‌తో కలిసి జాన్వీ కపూర్ ఫన్నీ డ్యాన్స్.. అర్జున్ కపూర్ ఏమని రియాక్ట్ అయ్యారంటే?
Janhvi Kapoor(File Photo)
Janardhan Veluru
|

Updated on: Jun 22, 2021 | 12:36 PM

Share

Janhvi Kapoor Funny Dance: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ప్రతి రోజూ తన ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను కుషీ చేస్తోంది. అలా సోషల్ మీడియా వేదికలపై తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను రోజురోజుకూ పెంచుకుంటోంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో ఇప్పటికే కోటి 16 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా జాన్వీ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన స్నేహితులతో కలిసి జాన్వీ కపూర్ గూఫీ డ్యాన్స్‌తో ఎంజాయ్ చేస్తోంది. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా రూపొందించిన ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఆమె ఫ్యాన్స్‌కు తెగనచ్చేసింది. 16 గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు 4.65 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ మెరిసింది. కెమరా ఫియర్ లేకుండా జాన్వీ కపూర్ ఈ వీడియోలో చాలా ఈజ్‌తో కనిపిస్తోందని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.

ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియోపై జాన్వీ సోదరుడు అర్జున్ కపూర్ స్పందించారు. దీని గురించి డిన్నర్ టైమ్‌లో సపరేట్‌గా మాట్లాడాలంటూ కామెంట్ చేశారు. అర్జున్ కపూర్ తన సోదరి జాన్వీ ఫన్నీ డ్యాన్స్ వీడియోపై కామెంట్ చేయడంపై నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇద్దరు తల్లులకు జన్మించిన వీరి మధ్య గత కొన్నేళ్లుగా మంచి బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. తండ్రి బోనీ కపూర్‌కు ఫ్యామిలీ మొత్తం అండగా నిలుస్తోంది.