AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: లాల్ సింగ్ ఎఫెక్ట్.. సంచలన నిర్ణయం తీసుకున్న అమీర్ ఖాన్.. షాక్‌లో ఫ్యాన్స్

ఇటీవల కాలంలో బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. సౌత్ సినిమాలు పాన్ ఇండియా హిట్స్ గా నిలుస్తుంటే హిందీ సినిమాలు మాత్రం కనీసం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి.

Aamir Khan: లాల్ సింగ్ ఎఫెక్ట్.. సంచలన నిర్ణయం తీసుకున్న అమీర్ ఖాన్.. షాక్‌లో ఫ్యాన్స్
Aamir Khan
Rajeev Rayala
| Edited By: |

Updated on: Sep 02, 2022 | 7:03 AM

Share

ఇటీవల కాలంలో బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. సౌత్ సినిమాలు పాన్ ఇండియా హిట్స్ గా నిలుస్తుంటే హిందీ సినిమాలు మాత్రం కనీసం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనిలేకుండా వరుసగా అక్కడ సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా తప్ప అక్కడ చెప్పుకోదగ్గ సినిమా లేదు.ఇదిలా ఉంటే స్టార్ హీరో అమీర్ ఖాన్ అయినా బాలీవుడ్ ను ఆదుకుంటాడేమో అని ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అమీర్ ఖాన్(Aamir Khan)నటించిన ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించారు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.

అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే ఈ సినిమాకు మైనస్ అయ్యాయని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాత దారుణంగా నష్టపోయారని తెలుస్తోంది. కనీసం 50 కోట్ల వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. దాంతో నిర్మాతలకు నష్టాలు మిగిలాయని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించారు చిత్రనిర్మాతలు అలాంటిదేమి లేదని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ ఈ సినిమాకోసం తీసుకున్న రెమ్యునరేషన్ 50 కోట్లు కూడా తిరిగి ఇచ్చేశారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో మరో వార్త ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తోంది. ఇక పై అమీర్ ఖాన్ సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారట. ఇక పై తాను హీరోగా సినిమాలు మానేయాలని అనుకుంటున్నట్టు ఓ వార్త ఇప్పుడు బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. లాల్ సింగ్ ఎఫెక్ట్ కారణంగా అమీర్ ఈ కీలక నిర్ణయానికి వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హీరోగా సినిమాలు ఆపేసి.. నిర్మాతగా సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారట అమీర్ . మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?
విచిత్ర రూపం..ప్రేమ అపరిమితం.. ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!
విచిత్ర రూపం..ప్రేమ అపరిమితం.. ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!