Bipasha Basu: బేబీ బంప్‌ ఫొటో షూట్‌పై దారుణమైన ట్రోలింగ్స్‌.. హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే..

Bipasha Basu: నిత్యం సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే బాలీవుడ్ నటీమణుల్లో బిపాసా బసు ఒకరు. ఈ అమ్మడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను 2016లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే...

Bipasha Basu: బేబీ బంప్‌ ఫొటో షూట్‌పై దారుణమైన ట్రోలింగ్స్‌.. హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే..
Bipasha Basu
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 02, 2022 | 10:41 AM

Bipasha Basu: నిత్యం సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే బాలీవుడ్ నటీమణుల్లో బిపాసా బసు ఒకరు. ఈ అమ్మడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను 2016లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బిపాసా తల్లి కాబోతోంది. ఈ సంతోషకర విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా బేబీ బంప్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇందులో భర్తతో కలిసి కాస్త బోల్డ్‌ లుక్‌లో దర్శనమిచ్చింది. దీంతో ట్రోలర్స్‌ బిపాసాపై విరుచుకుపడ్డారు. బేబీ బంప్‌ ఫొటో షూట్‌ పేరుతో స్కిన్‌ షో చేస్తావా అంటూ కామెంట్స్‌ చేశారు. ఇన్‌స్టా వేదికగా బిపాసా చేసిన ఈ పోస్టుకు నెగిటివ్‌ కామెంట్స్‌ వెల్లువెత్తాయి.

దీంతో ఈ ట్రోలింగ్‌కు ఎలాగైనా చెక్‌ పెట్టాలనుకున్న బిపాసా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తనపై గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ట్రోలింగ్‌పై తనదైన శైలిలో రియాక్ట్‌ అయ్యింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. మనం వారి అభిప్రాయాలను గౌరవించాలి. నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్లు లీడ్‌ చేస్తున్నాను.

ఇవి కూడా చదవండి

అలాగే నేను ఎల్లప్పుడూ 99 శాతం మంచిపైనే దృష్టిసారిస్తాను, కేవలం ఒక శాతం మాత్రమే నెగిటివిటీకి కేటాయిస్తాను. జీవితాన్ని ముందుకు నడిపించాల్సింది కూడా అలాగే. ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారన్న దానిపై మీ వ్యక్తిత్వం ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు. నా జీవితాన్ని నేను అలాగే జీవిస్తున్నాను. మన శరీరాన్ని మనం ప్రేమించాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను’ అంటూ బిపాసా ట్రోలర్స్‌కి చెక్‌ పెట్టింది.

View this post on Instagram

A post shared by Bipasha Basu (@bipashabasu)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే