Shah Rukh Khan: నెటిజన్ వింత ప్రశ్న.. దిమ్మతిరిగే రేంజ్‌లో ఆన్సర్ ఇచ్చిన షారుక్..
టామ్ క్రూజ్ చేసే విన్యాసాలు మాములుగా ఉండవు. ఆయన చేసే సాహసాలు చూస్తే ఒళ్ళు గగ్గుర్పొడిచిద్ది. బైక్‌తో కొండపైకి దూకడం వంటి విన్యాసాలు చాలానే చేశాడు. ఇలాంటివి టామ్ కు వెన్నతో పెట్టిన విద్య. నటన కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం చిన్న విషయం కాదు. ఇండియాలో ఇంత పెద్ద రిస్క్ ఎవరూ తీసుకోలేదు.
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. టామ్ క్రూజ్ చేసే విన్యాసాలు మాములుగా ఉండవు. ఆయన చేసే సాహసాలు చూస్తే ఒళ్ళు గగ్గుర్పొడిచిద్ది. బైక్‌తో కొండపైకి దూకడం వంటి విన్యాసాలు చాలానే చేశాడు. ఇలాంటివి టామ్ కు వెన్నతో పెట్టిన విద్య. నటన కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం చిన్న విషయం కాదు. ఇండియాలో ఇంత పెద్ద రిస్క్ ఎవరూ తీసుకోలేదు. అయితే తాజాగా కొంతమంది ఇలాంటి విన్యాసాల గురించి నటుడు షారూఖ్‌ను అడిగారు. దీనికి ఆయన సరదా సమాధానం ఇచ్చారు.
షారూఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ చిత్రంలోని మొదటి పాట విడుదలైంది. నవంబర్ 22 దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ పుట్టినరోజు కావడంతో డంకీ పాటను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ట్విట్టర్‌లో ‘AskSRK’ సెషన్ నిర్వహించారు. ఈ సమయంలో, ఆయన అనేక ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. షారూఖ్ ఖాన్‌ను ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగినప్పుడు, అతను ఫన్నీ సమాధానం ఇచ్చాడు.
మిషన్ ఇంపాజిబుల్ 7లో టామ్ క్రూజ్ చేసినట్లుగా మీరు ఎప్పుడైనా సాహసం చేయాలని అనుకున్నారా.? అని షారూఖ్‌ను ఓ నెటిజన్ అడిగారు. దీనికి షారుఖ్ ఖాన్ సమాధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ‘నా దగ్గర బైక్ లేదు’ అన్నాడు షారూక్ ఖాన్. ఈ సమాధానంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘నెవర్ మెస్ విత్ కింగ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల ద్వారా షారూఖ్ ఖాన్రెండు భారీ విజయాలను అందుకున్నాడు. రెండు సినిమాల్లోనూ ఇంటెన్స్ యాక్షన్ ఉంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల బిజినెస్ చేశాయి. నాలుగేళ్ల విరామం తీసుకున్న షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ విజయం సాధించాడు. ఇప్పుడు ‘డంకీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. షారూఖ్‌తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ నటిస్తున్నారు. డిసెంబర్ 22న సినిమా విడుదల కానుంది.
Mere paas motorcycle nahi hai yaar!!! #Dunki https://t.co/pr0Y4vaGmr
— Shah Rukh Khan (@iamsrk) November 22, 2023
షారుఖ్ ఖాన్ ట్విట్టర్ పోస్ట్
Now time to go for the rest of the days journey. Have fun guys and girls. Thank u for your time. Enjoy Lutt Putt a little more….until next time. Love u all. #Dunki
— Shah Rukh Khan (@iamsrk) November 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి