Shah Rukh Khan: బాబోయ్.. షారుఖ్ ఒక్క వాచ్ విలువతో పెద్ద విల్లానే కొనొచ్చు.. బాద్ షా పాటెక్ ఫిలిప్ వాచ్ ధర తెలుసా ?..

వరుస డిజాస్టర్లతో ఢీలా పడిన బాలీవుడ్‏కు మరోసారి కొత్త ఆశలు కలిగించాడు కింగ్. ఇక ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న నటులలో షారుఖ్ ఒకరు. మన్నత్ నివాసంతోపాటు.. ఆయన వద్ద ఖరీదైన వాచ్ లు, కార్లు, ఆస్తులు వరకు అన్ని విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో షారుఖ్ ముందుంటారు. 6000 కోట్ల రూపాయల నికర విలువతో బాద్ షా ప్రస్తుతం

Shah Rukh Khan: బాబోయ్.. షారుఖ్ ఒక్క వాచ్ విలువతో పెద్ద విల్లానే కొనొచ్చు.. బాద్ షా పాటెక్ ఫిలిప్ వాచ్ ధర తెలుసా ?..
Shah Rukh Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2023 | 1:51 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్.. ఆ వెంటనే జవాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు. వరుస డిజాస్టర్లతో ఢీలా పడిన బాలీవుడ్‏కు మరోసారి కొత్త ఆశలు కలిగించాడు కింగ్. ఇక ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న నటులలో షారుఖ్ ఒకరు. మన్నత్ నివాసంతోపాటు.. ఆయన వద్ద ఖరీదైన వాచ్ లు, కార్లు, ఆస్తులు వరకు అన్ని విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో షారుఖ్ ముందుంటారు. 6000 కోట్ల రూపాయల నికర విలువతో బాద్ షా ప్రస్తుతం భారతదేశపు అత్యంత ధనిక నటుడు. అతని విలాసవంతమైన జీవనశైలిలో ఒక ప్రత్యేక అంశం తరచుగా దృష్టిని ఆకర్షిస్తుంది. అదే అతని మల్టీ-మిలియన్ డాలర్ల వాచ్ సేకరణ.

ఇటీవల ఢిల్లీలో జరిగిన హ్యుందాయ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ లగ్జరీపై ఖరీదైన వాచ్ కలెక్షన్స్ పై మరోసారి తన ఆసక్తిని చూపించారు. ఈ ఈవెంట్ భారతదేశంలో వైకల్యం ఉన్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి లక్ష్యంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు షారుఖ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెల్లటి చొక్కా, ఫ్యాషన్ బ్లూ బ్లేజర్, బూడిద రంగు ప్యాంటు ధరించి, సొగసైన బ్లూ ఏవియేటర్‌లు , అతని సిగ్నేచర్ పోనీ హెయిర్‌స్టైల్‌తో షారుఖ్ స్టైల్ లుక్ మరింత పెంచేసింది. ఇక ఇదే ఈవెంట్లో అతను పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించాడు.

ఈ వాచ్ ధర రూ. 4.66 కోట్లు అని తెలుస్తోంది. ఇంతకు ముందు షారుఖ్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు వైరలయ్యాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తాప్సీ కథానాయికగా నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..