AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darsheel Safary: తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ‘దర్షీల్ సఫారీ’ పుట్టిన రోజు నేడు..

Darsheel Safary: దర్షీల్ సఫారీ .. ఈ పేరు వినగానే వెంటనే సినీ ప్రేక్షకులకు అమీర్ ఖాన్(Aamir Khan) సినిమా తారే జమీన్ పర్(Taare Zameen Par) గుర్తుకొస్తుంది. 2007లో రిలీజైన తారే జమీన్ పర్ చిత్రంతో బాలనటుడిగా ..

Darsheel Safary: తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న 'దర్షీల్ సఫారీ' పుట్టిన రోజు నేడు..
Darsheel Safary
Surya Kala
|

Updated on: Mar 09, 2022 | 10:48 AM

Share

Darsheel Safary: దర్షీల్ సఫారీ .. ఈ పేరు వినగానే వెంటనే సినీ ప్రేక్షకులకు అమీర్ ఖాన్(Aamir Khan) సినిమా తారే జమీన్ పర్(Taare Zameen Par) గుర్తుకొస్తుంది. 2007లో రిలీజైన తారే జమీన్ పర్ చిత్రంతో బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు. సినీ నటుడుగా కెరీర్‌ను ప్రారంభించాడు. మొదటి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. చిన్న వయసులో స్టార్ హీరో అమీర్ ఖాన్ కు పోటీగా దర్షీల్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు యంగ్ హీరోగా నటుడిగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. స్మార్ట్ లుక్ తో అలరిస్తున్నాడు. నేడు దర్షిల్ పుట్టిన రోజు.

తారే జమీన్ పర్ సినిమా తర్వాత 2010 సంవత్సరంలో బం బం బోలే చిత్రంలో కనిపించాడు. 2011లో దర్షీల్ డిస్నీ  జోకోమోన్ చిత్రంలో సూపర్ హీరో పాత్రను పోషించాడు. దర్షీల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో పని చేశాడు. అనంతరం దర్షీల్ “ఝలక్ దిఖ్లాజా” డ్యాన్స్ షో లో కనిపించి.. బుల్లి తెర ప్రేక్షకులను తన డ్యాన్స్ తో అలరించాడు. తన నృత్య ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

దీని తరువాత దర్షీల్..  యే హై ఆషికీ సన్ యార్ ట్రై మార్ లో కనిపించాడు. ఈ సినిమాలో దర్శీల్  బాలనటుడి నుంచి యంగ్ హీరోగా కనిపించాడు. దర్షీల్ యంగ్ లుక్ అభిమానులకు బాగా నచ్చింది.  2020 సంవత్సరంలో రిలీజైన ప్యార్ నాల్ పాటలో అనుష్క సేన్ తో కలిసి దర్షీల్ కలిసి కనిపించాడు. అంతేకాదు ఇటీవల ఆన్‌లైన్‌లో విడుదలైన షార్ట్ ఫిల్మ్  డ్రామాయమాలో దర్శీల్ ,  సుస్మితా సేన్ కుమార్తె రెనే కనిపించారు.

Also Read:

 అదిరే అందాలతో కవ్విస్తోన్న ఎస్టర్ నోరోన్హా లేటెస్ట్ ఫొటోస్