Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా ?.. పాన్ ఇండియా రేంజ్‏లో మతిపోయే ఫాలోయింగ్.. కింగ్ ఆఫ్ బాలీవుడ్..

మరోవైపు తారల చిన్ననాటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా..వారి చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో లేటేస్ట్ క్రేజీ పిక్స్ నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ స్టార్ హీరోకు పాన్ ఇండియా రెంజ్ లో మతిపోయే ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ అందుకున్నారు. గుర్తుపట్టండి.

Tollywood: ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా ?.. పాన్ ఇండియా రేంజ్‏లో మతిపోయే ఫాలోయింగ్.. కింగ్ ఆఫ్ బాలీవుడ్..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2023 | 9:00 PM

సోషల్ మీడియాలో నిత్యం సరికొత్త విషయాలు ట్రెండింగ్ అవుతుంటాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు.. టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలకు సంబంధించిన విషయాలు చక్కర్లు కొడుతుంటాయి. సినిమా అప్డేట్స్ మాత్రమే కాదు.. వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరోవైపు తారల చిన్ననాటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా..వారి చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో లేటేస్ట్ క్రేజీ పిక్స్ నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ స్టార్ హీరోకు పాన్ ఇండియా రెంజ్ లో మతిపోయే ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ అందుకున్నారు. గుర్తుపట్టండి. అతను బాలీవుడ్ హీరో. 90’sలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అతనే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.

షారుఖ్ ఖాన్.. ఈ స్టార్ హీరో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నాయి. బాద్ షా స్టైల్, యాక్టింగ్, యాటిట్యూ్డ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ అందుకున్నారు. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ షారుఖ్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారు. చాలా కాలం తర్వాత ఇటీవలే పఠాన్ సినిమాతో సంచలనం సృష్టించిన షారుఖ్.. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం జవాన్.

ఇవి కూడా చదవండి

భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి షారుఖ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చేతిలో రివాల్వర్ తో.. గుండుతో స్టైలీష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు షారుఖ్. ఈ పోస్టర్ చూస్తుంటే..ఆయనను గుర్తుపట్టడం కష్టమే. కానీ పరిశీలనాగ చూస్తే మాత్రం షారుఖ్ అని తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుంది. ఇందులో ప్రియమణి, దీపికా పదుకొణె ముఖ్య పాత్రలలో కనిపించనుండగా.. సెప్టెంబర్ 7న భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.