Tollywood: ఒక వైపు నత్తి.. మరో వైపు వెన్నెముకలో సమస్య.. కట్ చేస్తే.. ఈ హీరో ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు
తండ్రి స్టార్ డైరెక్టర్ కావడంతో చిన్నప్పుడే సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. బాల్యంలోనే పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆపై హీరోగానూ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. ఏకంగా రూ.3000 కోట్ల ఆస్తులతో..

సినిమా సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్ అనుకుంటారు చాలామంది. కోట్లలో రెమ్యునరేషన్లు, విశాలమైన భవనాలు, లగ్జరీ కార్లు, నిత్యం విందులు, వినోదాలు.. ఇలా సినీ తారల జీవితం ఎంతో ఎంజాయ్ బుల్ గా ఉంటుందనుకుంటారు. అయితే వాళ్లు కూడా మనుషులే. అందరికీ ఉండే సమస్యలే వారికి ఉంటాయి. ముఖ్యంగా ఈ స్థాయికి చేరుకోవడానికి వారెంతో కష్టపడ్డారో ఎవరికీ కనిపించదు. అలాగే ప్రస్తుతం స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది చిన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఈ ఇండియాను స్టార్ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. చిన్నతనంలో నత్తి ఉండడంతో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. స్కూల్ లో తోటి విద్యార్థులతో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ కారణంగా స్నేహితులు కూడా ఉండే వారు కాదు. ఈ బాధతో ఒంటరిగా కుమిలిపోయాడు. దీనికి తోడు వెన్నెముకలో సమస్య ఉందని డాక్టర్లు షాకింగ్ విషయం చెప్పారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ పిల్లాడు స్టార్ హీరో అయ్యాడు. తన యాక్టింగ్, డ్యాన్సులతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్నాడు. ఒక్కో సినిమాకు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. భారత సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన నటుల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరునుకుంటున్నారా? బాలీవుడ్ గ్రీకు వీరుడు, ఇటీవలే వార్ 2తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన హృతిక్ రోషన్.
చిన్న తనంలో ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులే తనను బలంగా మార్చాయంటున్నాడు హృతిక్ రోషన్. జీవితలో మరింత పట్టుదలతో ముందుకెళ్లడం నేర్పించాయంటున్నాడు. కాగా ప్రస్తుతం హృతిక్ రోషన్ ఆస్తుల విలువ సుమారు రూ.3000 కోట్లకు పైగానే ఉంది. సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెడుతూ బాగానే సంపాదిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ముంబైతో పాటు లోనావాలాలో ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా హృతిక్ కు ఆస్తులున్నాయి.
వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్..
Find us on the dance floor the second this beat drops 🔥
Watch #War2 in cinemas now in Hindi, Telugu and Tamil. Book your tickets! https://t.co/empQLqeFMr | https://t.co/7d0OKxPnOI @iHrithik | @tarak9999 | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial | #SachetTandon |… pic.twitter.com/RyWLwmCcid
— Yash Raj Films (@yrf) August 26, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమాలో నటించాడు హృతిక్ రోషన్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది.
Nothing but vibes every time #AavanJaavan plays ✨
Watch #War2 in cinemas now in Hindi, Telugu and Tamil. Book your tickets! https://t.co/empQLqfdBZ | https://t.co/7d0OKxPVEg pic.twitter.com/TAnQKQ33xW
— Yash Raj Films (@yrf) August 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








