Tollywood: ఒకప్పుడు ఏసీ మెకానిక్.. కట్ చేస్తే స్టార్ హీరోగా క్రేజ్ .. చివరకు పిన్న వయసులోనే క్యాన్సర్‌తో..

ఈ స్టార్ నటుడు తొలుత క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు. ప్రతిష్ఠాత్మక సీకే నాయుడు ట్రోఫీ టోర్నమెంట్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ తన పేదరికం క్రికెట్ కలలను చిదిమేసింది. దీంతో ఒకానొక సందర్భంలో వీధుల్లో ఏసీ రిపేరింగ్ పనులు చేసి పొట్ట నింపుకొన్నాడు.

Tollywood: ఒకప్పుడు ఏసీ మెకానిక్.. కట్ చేస్తే స్టార్ హీరోగా క్రేజ్ .. చివరకు పిన్న వయసులోనే క్యాన్సర్‌తో..
Tollywood Actor

Updated on: Apr 26, 2025 | 12:52 PM

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన నటులు చాలా కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ ట్యాలెంటెడ్ హీరో కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఇతనికి గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరూ. అయిన కష్టపడి స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం భారతీయ సినిమాల్లోనే కాదు బ్రిటిష్, అమెరికన్ ఫిల్మ్స్ లోనూ నటించారు. తన అద్భుత నటనతో భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే గర్వించదగ్గ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన 30 ఏళ్ల సినిమా కెరీర్ లో పద్మశ్రీ, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, ఫిల్మ్‌పేర్ పురస్కారాలు.. ఇలా లెక్కలేనన్నీ అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. ఇలా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ నటుడు పిన్న వయసులోనే ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడి 53 ఏళ్లకే మనందరిని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు అతను మన మధ్యన లేకున్నా తన సినిమాల రూపంలో ఎప్పటికీ మన హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి పోయాడు. తను మరెవరో కాదు ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్.

బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఇర్ఫాన్‌ ఖాన్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు జైపూర్‌లో ఏసీ రిపేర్‌ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ముంబైకి వెళ్లి ఏసీలు రిపేర్ చేసే టెక్నీషియన్‌గా పనిచేశాడు. అదే సమయంలో నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు. తండ్రి చనిపోయినా, ఆర్థిక సమస్యలు వెంటాడినా తన కలల వైపు ప్రయాణం సాగించాడు. పీకు, ది లంచ్‌బాక్స్, స్లమ్‌డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమర్ వంటి హిందీ సినిమాలతో పాటు లైఫ్ ఆఫ్ పై, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, జురాసిక్ పార్క్ తదితర హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు ఇర్ఫాన్ ఖాన్. 2018లో ఈ విషయాన్ని బయట పెట్టిన ఇర్ఫాన్ సుమారు రెండేళ్లు క్యాన్సర్‌తో పోరాడాడు. కానీ చివరకు కరోనా మహమ్మారి కాలంలో శాశ్వతంగా ఈ లోకం నుంచే వెళ్లిపోయాడు. ఇర్ఫాన్‌ ఖాన్ తెలుగు సినిమాల్లోనూ నటించాడు. మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో విలన్ గా ఇర్ఫాన్‌ ఖాన్ అద్భతంగా నటించాడు.

సినిమాల్లో బిజీ అవుతోన్న ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.