Salman Khan: బాలీవుడ్‌ భాయ్‌జాన్‌కు బెదిరింపు లేఖ.. సిద్ధూలానే హతమారుస్తామంటూ..

|

Jun 05, 2022 | 8:00 PM

Salman Khan: . సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌ ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ బెంచ్‌పై కూర్చున్నప్పుడు అతడిని, అతని కొడుకు సల్మాన్‌ఖాన్‌ని బెదిరిస్తూ ఈ లేఖ కనిపించింది. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూస్ వాలాలా సల్మాన్‌ను కూడా హతమారుస్తామని ఈ లేఖలో బెదిరించారు అగంతకులు

Salman Khan: బాలీవుడ్‌ భాయ్‌జాన్‌కు బెదిరింపు లేఖ.. సిద్ధూలానే హతమారుస్తామంటూ..
Salman Khan
Follow us on

Salman Khan: బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ , ఆయన తండ్రి సలీంఖాన్‌ను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. పంజాబ్‌ సింగర్‌ సిద్దు మూసేవాలా లాగే సల్మాన్‌ను చంపేస్తామని ఈ లేఖలో బెదిరించారు. ఈ లేఖపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది సల్మాన్‌ఖాన్‌ కుటుంబం. దీంతో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు లేఖ ఎవరు రాశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. బాలీవుడ్ భాయ్‌జాన్‌ సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌ ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ బెంచ్‌పై కూర్చున్నప్పుడు అతడిని, అతని కొడుకు సల్మాన్‌ఖాన్‌ని బెదిరిస్తూ ఈ లేఖ కనిపించింది. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూస్ వాలాలా సల్మాన్‌ను కూడా హతమారుస్తామని ఈ లేఖలో బెదిరించారు అగంతకులు. ఉదయం 7:30 నుంచి 8:00 గంటల సమయంలో సలీం ఖాన్‌కు లేఖ అందింది. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా కొద్ది రోజుల క్రితం పంజాబీ సింగర్‌ సిద్ధూ హత్యతో సల్మాన్ ఖాన్ కు కూడా భద్రతను పెంచారు ముంబై పోలీసులు. ఇక ఈ హత్యలో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టార్‌ లారెన్స్‌ బిష్టోయ్‌ అన్న సంగతి తెలిసిందే. ఇదే సమంయలో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందున సల్మాన్ ను హత్య చేస్తానని గతంలో ఓ సందర్భంలో బెదిరించాడు బిష్ణోయ్‌. ఈక్రమంలో సల్మాన్ ఖాన్ హత్యకు సంబంధించి రెక్కీ నిర్వహించేందుకు ముంబైకి వెళ్లాడని పోలీసులు కనుగొన్నారు. 2020 ఒక హత్య కేసులో బిష్ణోయ్ సహచరుడు రాహుల్ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తున్న సమయంలో సల్మాన్ ను చంపబోతున్నాం అని పోలీసులకు తెలిపాడు. దీంతోనే సల్మాన్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్‌.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..

IIFA 2022: ఐఫాలో సెలబ్రిటీలు రెడ్‌ కార్పెట్‌పై కాకుండా గ్రీన్‌ కార్పెట్‌పై నడుస్తారు.. కారణమేంటో తెలుసా?