సినిమా తారలను వదలని కరోనా.. బాలీవుడ్ స్టార్ హీరోకు కోవిడ్ పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. సామాన్యులు సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు

  • Rajeev Rayala
  • Publish Date - 1:10 pm, Wed, 24 March 21
సినిమా తారలను వదలని కరోనా.. బాలీవుడ్ స్టార్ హీరోకు కోవిడ్ పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు
Aamir Khan

Aamir Khan tests positive : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. సామాన్యులు సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక సినిమా తారలు కూడా ఒకరి తరవాత ఒకరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తెలుగులోనూ పలువురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరున్న స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం అమీర్ ఆరోగ్యం మెరుగుగానే ఉందని ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. ఇక అమీర్ ఖాన్ కు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయనను కలిసిన వారుకూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో అతడితో కలిసి షూటింగ్ పాల్గొన్న హీరోయిన్ కియారా అద్వానీ, టబు కూడా పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో కియారా అడ్వాణీకి  నెగిటివ్ రిపోర్ట్ రాగా.. టబు రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు అమీర్ కు కరోనా అని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Malaika Arora: అమ్మడి అందానికి అసలు రహస్యం ఇదేనా.. జిమ్ లో కసరత్తులతో కవ్విస్తున్న బాలీవుడ్ భామ

‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్‌ పోస్ట్ : Naveen Polishetty video.