Sohakshi Sinha: ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొన్న హీరోయిన్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే..

|

Sep 13, 2023 | 10:19 PM

ముఖ్యంగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయడం బాలీవుడ్ నటీనటులకు ఇష్టమైన పెట్టుబడి. ముంబైలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ పుంజుకోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇటీవలే అలియా భట్, రణబీర్ కపూర్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ మిగతా హీరోహీరోయిన్స్ ఇప్పటికే ప్లాట్స్ కొనుగోలు చేయగా.. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు కోటి రూపాయలతో ముంబైలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

Sohakshi Sinha: ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొన్న హీరోయిన్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే..
Sonakshi Sinha
Follow us on

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయడం బాలీవుడ్ నటీనటులకు ఇష్టమైన పెట్టుబడి. ముంబైలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ పుంజుకోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇటీవలే అలియా భట్, రణబీర్ కపూర్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ మిగతా హీరోహీరోయిన్స్ ఇప్పటికే ప్లాట్స్ కొనుగోలు చేయగా.. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు కోటి రూపాయలతో ముంబైలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ముంబైలోని చాలా మంది స్టార్ నటీనటులు బాంద్రా, వెర్సోవా, జుహు ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు నటి సోనాక్షి కూడా అదే ప్రాంతంలో కొత్త ఇల్లు కొన్నారు. బాంద్రాలోని ఐషారామి అపార్ట్‌మెంట్స్‌లోని 26వ అంతస్తులో సోనాక్షి ఒక పెద్ద ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ కొనుగోలు కోసం సోనాక్షి 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సోనాక్షి బాంద్రాలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. 2430 చదరపు అడుగుల ఫ్లాట్ కోసం రూ.11 కోట్లు చెల్లించింది. దీని ఇంటీరియర్, ఇతర భాగాలకు దాదాపు 1 కోటి ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ కాంప్లెక్స్‌ను పిరమిడ్ డెవలపర్స్, అల్ట్రా లైఫ్‌స్పేస్ నిర్మించాయి. సోనాక్షి నేరుగా డెవలపర్‌ల నుండి ప్లాట్‌ను కొనుగోలు చేసింది.

ఆగస్టులో సోనాక్షి ఈ ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. ఈ కాంప్లెక్స్‌లో ఇది ఆమె ఫ్లాట్ కొనుగోలు రెండవది. అంతకుముందు 2020 మార్చి నెలలో, అదే అపార్ట్‌మెంట్‌లో 4632 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ 16వ అంతస్తులో ఉంది. సోనాక్షి సిన్హా ఈ ఫ్లాట్ కోసం 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 8500 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేశారు, దీని కోసం అతను సుమారు 29 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. సారా అలీ ఖాన్ 2100 చదరపు అడుగుల ప్లాట్‌ను 9 కోట్లకు కొనుగోలు చేసింది. కార్తీక్ ఆర్యన్ కూడా ఇదే ప్రాజెక్ట్‌లో 2100 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది జూలై నెలలో జుహు ప్రాంతంలోని సిద్ధి వినాయక్ అపార్ట్‌మెంట్‌లో 17.50 కోట్లు వెచ్చించి 1916 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కార్తీ కార్యన్ కొనుగోలు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.