Jawan Movie: బాద్ షా మేనియా.. జవాన్ ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ హక్కులు ఎన్ని కోట్లంటే..

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాద్ షా తొలిసారిగా మాస్ అండ్ రగ్గడ్ లుక్‏లో యాక్షన్ హీరోగా నటించారు. దీంతో ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‏గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

Jawan Movie: బాద్ షా మేనియా.. జవాన్ ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ హక్కులు ఎన్ని కోట్లంటే..
Jawan Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2023 | 7:46 PM

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కెరీర్‏లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం జవాన్. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే రూ.129 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత వరుసగా నాలుగు రోజుల్లో 400 కోట్లు రాబట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూళ్లు చేసింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాద్ షా తొలిసారిగా మాస్ అండ్ రగ్గడ్ లుక్‏లో యాక్షన్ హీరోగా నటించారు. దీంతో ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‏గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే నెలలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా దాదాపు 45 నుంచి 60 రోజుల తర్వాత అంటే అక్టోబర్ చివరి వారంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ తమ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చెల్లీస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాతో నయన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 12న) ఈ సినిమా రూ.38 కోట్లు కలెక్షన్స్ అందుకుంది. అయితే మొదటి వారంలో రోజుకు వంద కోట్లు రాబట్టిన ఈ చిత్రం కలెక్షన్స్ ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి .

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.