Shilpa Shetty: ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శిల్పాశెట్టి.. సోషల్ మీడియాకు బ్రేక్.. కారణమేంటంటే..
Shilpa Shetty: ఎప్పటికప్పుడు తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే హెల్త్, యోగా, కుకింగ్ టిప్స్‌లను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ బాలీవుడ్ బ్యూటీ తన అభిమానులకు షాక్ ఇచ్చింది.
Shilpa Shetty: బాలీవుడ్ టాల్ బ్యూటీ శిల్పాశెట్టి (Shilpa Shetty) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాహసవీరుడు సాగరకన్య, వీడెవడండి బాబు, ఆజాద్ తదితర సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా చేరువైందీ ముద్దుగుమ్మ. సినిమాలు, టీవీ షోలతో నిత్యం బిజీబిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే హెల్త్, యోగా, కుకింగ్ టిప్స్‌లను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ బాలీవుడ్ బ్యూటీ తన అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలం వరకు తను సామాజిక మాధ్యమాల్లో కనిపించనని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పూర్తి బ్లాక్ ఫొటోను షేర్ చేసింది.
బోర్ కొట్టేసింది..
‘ఎలాంటి కొత్తదనం లేదు. అంతా ఒకేలా కనిపిస్తోంది. చాలా బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తదనం కనిపించేవరకు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటాను’ అని పోస్టులో పేర్కొంది శిల్ప. దీంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. కాగా గతేడాది హంగామా2 తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శిల్పా ఆ సినిమా చేదు ఫలితాన్నే మిగిల్చింది. త్వరలోనే నికమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ ముద్దుగుమ్మ. దీంతో పాటు ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తోంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో శిల్ప నటిస్తోంది. ఆమెతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా పలువురు ప్రముఖులు ఈ సిరీస్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం, ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్‌సిరీస్ విడుదల కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: