Tirupati: కిచెన్‌లో నుంచి వింత శబ్ధాలు.. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా షాక్..!

ఇంట్లో అందరూ కూడా హాల్‌లో సేద తీరుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి... ఏంటా అని వెళ్లి చూడగా షాక్...

Tirupati: కిచెన్‌లో నుంచి వింత శబ్ధాలు.. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా షాక్..!
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2022 | 6:09 PM

Viral Video: అడవుల్లో… మరుగు ప్రదేశాల్లో ఉండాల్సిన.. జీవులు ఈ మధ్య జనావాసాల్లో చేరి హడలెత్తిస్తున్నాయి. రోడ్లపైకి రావడం.. లేదంటే ఇంట్లోకి రావడం… వాహనాల్లో మనతో పాటు జర్నీ చేయడమో చేస్తూ.. ఒక్కసారిగా జడిపిస్తున్నాయి. ఇందుకు కారణం పీక్ సమ్మర్.. దాహం కారణంగానో, వేసవి తాపానికి తట్టుకోలేకో అడవిలో ఉండాల్సిన ఈ జీవులు.. జనావాసాల్లోకి వస్తున్నాయి. ఏపీ(AP)లోని తిరుపతిలో అయితే పక్కనే అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ పాములు రెగ్యులర్‌గా ఇళ్ల మధ్యకు వస్తాయి. తాజాగా తిరుమల బాలాజీ నగర్ లోని ఓ ఇంట్లోని కిచెన్ నుంచి బుస్.. బుస్ మంటూ  వింత శబ్ధాలు వచ్చాయి. ఆ సమయంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు హాల్‌లో ఉన్నారు. తొలుత వారు ఈ సౌండ్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అవి క్రమేపీ పెద్దగా వస్తుండటంతో ఏమై ఉంటుందని చెక్ చేయగా ఒక్కసారిగా వారు ఖంగుతిన్నారు. ఎలా వచ్చిందో.. ఏమో తెలీదు కానీ  ఓ పెద్ద జెర్రిపోతు ఆ ఆఇంట్లోని కిచెన్‌లోకి ప్రవేశించింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకి సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని పాముని చాకచక్యంగా బంధించారు. ఆ తర్వాత సురక్షితంగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.