Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వేసవి రద్దీ దృష్ట్యా.. జూన్ 30వరకూ తాత్కాలికంగా ఆ సేవలు రద్దు..

వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. మే 14, 15వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు శ్రీ అన్నమాచార్యుల 614వ జ‌యంతి ఉత్సవాలు మే 16 నుండి 22వ తేదీ వరకు తాళ్లపాక, తిరుపతిలో ఘ‌నంగా జ‌రపనున్నామని ప్రకటించారు. 

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వేసవి రద్దీ దృష్ట్యా.. జూన్ 30వరకూ తాత్కాలికంగా ఆ సేవలు రద్దు..
Tirumala
Follow us

|

Updated on: May 13, 2022 | 7:33 PM

Turumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Srivenkateswaraswami) కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి(Tirumala Tirupati). శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో టీటీడీ భక్తుల సౌకర్యార్ధం కొన్ని చర్యలు చేపట్టింది. వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. అష్టద‌ళ‌ పాద‌ ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ సేవ‌ల‌నుమాత్రమే తాత్కాలికంగా ర‌ద్దు చేశామ‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. అంతేకాదు భక్తులకు ఎటువంటి ఆ సౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని.. కనుక శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఎక్కువ‌మందిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఫోన్‌చేసినా శ్రీ‌వారి సేవ అవ‌కాశం క‌ల్పిస్తాని చెప్పారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తుల కోసం ఆన్‌లైన్‌లో రోజుకు 1000 టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు మే 14, 15వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయని చెప్పారు. ఇక శ్రీ అన్నమాచార్యుల 614వ జ‌యంతి ఉత్సవాలు మే 16 నుండి 22వ తేదీ వరకు తాళ్లపాక, తిరుపతిలో ఘ‌నంగా జ‌రపనున్నామని ప్రకటించారు.

ఇక ఏప్రిల్ నెలలో కోనేటిరాయుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను కూడా ప్రకటించారు. ఏప్రిల్ లో 20.64 ల‌క్షలు2 ల‌క్ష‌ల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఇక భక్తుల నుంచి స్వామి వారి హుండీ కానుకల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.127 కోట్లు. తిరుమ‌ల శ్రీ‌వారి ఇ-హుండీ కానుక‌లు – రూ.4.41 కోట్లు. 99.07 ల‌క్ష‌ల శ్రీవారి లడ్డులు విక్రయించారు. 9.91 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. 27.76 ల‌క్ష‌ల మంది భ‌క్తులు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఇ-హుండీ కానుక‌లు రూ.13 ల‌క్ష‌ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!