Shahrukh Khan: మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై వివాదం.. షారుక్ ఖాన్ 14 ఏళ్ల నాటి వీడియో వైరల్.. ఫ్యాన్స్ మనసుని గెలుచుకున్న బాద్షా

షారుక్‌ను హాలీవుడ్‌ సినిమాల్లో నటించే ఆలోచన ఉందా అని అడిగిన సందర్భంలో.. షారుక్ ఖాన్ మాట్లాడుతూ- 'నా ఇంగ్లీషు అంత బాగా ఉండదు అంటూ.. నవ్వుతూనే తన అభిప్రాయాలను చెప్పారు..

Shahrukh Khan: మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై వివాదం.. షారుక్ ఖాన్ 14 ఏళ్ల నాటి వీడియో వైరల్.. ఫ్యాన్స్ మనసుని గెలుచుకున్న బాద్షా
Shah Rukh Khan
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2022 | 4:10 PM

Shahrukh Khan: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల బాలీవుడ్ లో తన ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ హాలీవుడ్‌ ఎంట్రీ పై మాట్లాడిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది.  షారుఖ్ వినయపూర్వకంగా తాను  హాలీవుడ్‌కు అనర్హుడిని అంటూ చెప్పిన కారణాలు ఆయన అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి. ఈ వీడియో చాలా పాతది.  14 సంవత్సరాల క్రితంది. ఇప్పుడు బాలీవుడ్ ఫ్యాన్స్, షారుక్ ఖాన్ అభిమానులు సూపర్ స్టార్  పాత వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

షారుక్ ఖాన్ వైరల్ వీడియోలో ఏముందంటే:  ఆ వీడియోలో షారుక్ ఖాన్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. షారుక్‌ను హాలీవుడ్‌ సినిమాల్లో నటించే ఆలోచన ఉందా అని అడిగిన సందర్భంలో.. షారుక్ ఖాన్ మాట్లాడుతూ- ‘నా ఇంగ్లీషు అంత బాగా ఉండదు అంటూ.. నవ్వుతూనే తన అభిప్రాయాలను చెప్పారు. షారుక్ చెప్పిన మాటలు విని అక్కడున్న జనం నవ్వడం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

షారుక్ ఖాన్ ఏం చెప్పాడంటే..

నాకు మాట్లాడని.. మూగ పాత్ర ఇస్తే బహుశా నేను హాలీవుడ్ నటించగలనేమో అనుకుంటున్నాను.. నేను నిరాడంబరంగా ఉండటానికి ప్రయత్నించడం లేదు .. నా వయసు 42(అప్పుడు). నా చర్మం రంగు కూడా గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇక్కడ నటుడిగా ఎంట్రీ ఇవ్వడానికి నాకు ప్రత్యేకమైన USP ఏదీ లేదు. నాకు కుంగ్‌ఫు తెలియదు, నాకు డ్యాన్స్ రాదు, లాటిన్ సల్సా ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. నేను పొడుగ్గా లేను. . నేను చాలా యూరోపియన్ సినిమాలు చూశాను. అప్పుడు నాకు హాలీవుడ్ లో చోటు ఉన్నదని అనిపించలేదని… చెప్పారు. అసలు నాకు హాలీవుడ్ లో నటుడుగా చోటు ఉందని అనిపించలేదని చెప్పారు షారుఖ్.

అంతేకాదు తాను భారతదేశంలో నటుడిగా కొనసాగించాలనుకుంటున్నట్లు.. భారతీయ సినిమాని ప్రపంచానికి తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాను..  అదే తన ఆశయం” అని షారుఖ్ చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల   కోసం ఇక్కడ క్లిక్ చేయండి..