Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య సేవలో అమితాబ్‌.. నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రత్యేక పూజలు .. వీడియో

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రెండోసారి అయోధ్యను సందర్శించారు . ఇటీవల బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శుక్రవారం (ఫిబ్రవరి 09) మళ్లీ శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఓ నగల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అయోధ్య వెళ్లిన ఆయన బాలరామయ్య సేవలో పాల్గొన్నారు

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య సేవలో అమితాబ్‌.. నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రత్యేక పూజలు .. వీడియో
Amitabh Bachchan

Updated on: Feb 09, 2024 | 2:56 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రెండోసారి అయోధ్యను సందర్శించారు . ఇటీవల బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శుక్రవారం (ఫిబ్రవరి 09) మళ్లీ శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఓ నగల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అయోధ్య వెళ్లిన ఆయన బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బిగ్ బి రాక సందర్భంగా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ మరియు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య బిగ్‌బీ ఆలయం నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అమితాబ్‌ బచ్చన్‌ నెల రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. బిగ్‌ బీ గత నెలలో బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. భార్య జయాబచ్చన్‌, కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఈ వేడుకకు వచ్చారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖ కళాకారులు, వ్యాపారవేత్తలు ఈ మహాక్రతువులో భాగమయ్యారు. . తొలిసారిగా అయోధ్యకు వచ్చి శ్రీరాముని దర్శనం చేసుకున్న తర్వాత అమితాబ్ బచ్చన్ ఫోటోను షేర్ చేశారు. బ్లాగ్ లో కూడా అయోధ్య రామయ్య దర్శనానికి సంబంధించిన వివరాలను పంచుకున్నాడు ‘దైవాత్మ ఉనికితో నిండిన రోజు. నేను అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నుండి తిరిగి వచ్చాను. సాంస్కృతిక వైభవం, ఆచారం, విశ్వాసం ఈ ఆలయంలో ఉన్నాయి. ‘ అని తన పోస్ట్‌ లో రాసుకొచ్చారు అమితాబ్‌.

కాగా రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమితాబ్ బచ్చన్ అయోధ్యలో కోట్ల రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు వయసు పెరుగుతున్నా బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌కు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటాడు. ఇక ప్రకటనల ద్వారా కూడా కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాగే కేబీసీ లాంటి టీవీ షోలను ప్రజెంట్ చేస్తూ ఆదాయం గడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయోధ్యలో అమితాబ్ బచ్చన్..

భారీబద్రత నడుమ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.