Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్క్రీన్ ముందుకు శిల్పాశెట్టి.. కష్టసమయాల్లో వ్యతిరేక ఆలోచనలు అంటూ..

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను అళ్లీల వీడియోల కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భర్త అరెస్ట్ కావడంతో

Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్క్రీన్ ముందుకు శిల్పాశెట్టి.. కష్టసమయాల్లో వ్యతిరేక ఆలోచనలు అంటూ..
Shipa Shetty
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 16, 2021 | 10:15 PM

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను అళ్లీల వీడియోల కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భర్త అరెస్ట్ కావడంతో శిల్పా శెట్టి గత కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. తాజాగా శిల్పాశెట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోవిడ్ 19 నిధుల సేకరణ కార్యక్రమం.. వి ఫర్ ఇండియా కోసం ఆమె మొదటి సారి స్క్రీన్ ముందుకు వచ్చారు. ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో మలైకా అరోరా, అర్జున్ కపూర్, విద్యాబాలన్, దియా మీర్జా సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందుకోసం శిల్పా శ్యాస వ్యాయామాలను గురించి చెప్పుకొచ్చారు.

మెదడు కణాలకు ఆక్సిజన్ సరిగ్గా చేరడం వలన కలిగే ప్రయోజనాల గురించి శిల్పా ఈ యాడ్ ద్వారా వివరించింది. అంతా శ్వాస మీద ఆధారపడిన కాలంలో మనం జీవిస్తున్నాం. శ్వాస ద్వారా మనం మొత్తం వ్యవస్థను కాపాడుకోవచ్చు. ముక్కు ద్వారా శ్వాస తీసుకునే ఆక్సిజన్ మెదడు కణాలకు సులభంగా చేరుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని శిల్పా అన్నారు. అలాగే ప్రతి కూల ఆలోచనలను ఎలా అధిగమమించాలో కూడా శిల్పా చెప్పుకొచ్చారు. కష్ట సమయాల్లో నెటిటివ్ ఆలోచలు రావడం సహజం. కానీ ఆ భావోద్వేగాలను నియంత్రించడం, మీ శ్వాసను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకే సానుకూలంగా ఉండటానికి మీ శ్వాసను మెరుగుపరచడానికి ప్రాణయామం మరింత ముఖ్యమైనది చెప్పారు శిల్పా శెట్టి. అలగే ప్రతి ఒక్కురు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. టీకాలు వేసుకోవాలని చెప్పారు.

ట్వీట్..

జూలై 19న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను తెరకెక్కించాడనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ కూడా శిల్పా వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

Also Read: Dia Movie Telugu: సూపర్ హిట్ సినిమా దియా ఇప్పుడు తెలుగులో.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..

Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మాహారాజా..