AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dia Movie Telugu: సూపర్ హిట్ సినిమా దియా ఇప్పుడు తెలుగులో.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా దియా. ఈ మూవీకి కేవలం కన్నడలోనే కాకుండా..తెలుగు, తమిళ్ భాషలలో కూడా

Dia Movie Telugu: సూపర్ హిట్ సినిమా దియా ఇప్పుడు తెలుగులో.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..
Dia
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2021 | 9:17 AM

Share

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా దియా. ఈ మూవీకి కేవలం కన్నడలోనే కాకుండా..తెలుగు, తమిళ్ భాషలలో కూడా అభిమానులు ఉన్నారు. కె.ఎస్.ఎస్ అశోక్ దర్శకత్వం వహించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమకథ.. అక్కడ సూపర్ హిట్‏గా నిలిచింది. ఇందులో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావడానికి చాలా రోజులుగా మేకర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ఘ నీరిక్షణ అనంతరం ఎట్టకేలకు ఈ మూవీ తెలుగులో రాబోతుంది.

తాజాగా దియా తెలుగు డబ్బింగ్ మూవీ ఆగస్ట్ 19న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు చిత్రసంస్థ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. కృష్ణ చైతన్య నిర్మించారు. అలాగే కెమెరా వర్క్ కోసం విశాల్ విట్టల్, సౌరభ్ వాగ్మారే.. ఎడిటింగ్ నవీన్ రాజ్ పనిచేశారు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 16న అంటే ఈరోజు ప్రసాద్ లాబ్స్‏లో ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను నిర్వహించనున్నారు.

ట్వీట్..

Also Read:  CM KCR Huzurabad Tour: ఇవాళ హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. దళిబంధు పథకానికి శ్రీకారం.. మొదటి చెక్కు అందుకునేదీ ఎవరంటే?

Jaggery Side Effects: బెల్లం ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్తగా.. శ్రుతిమించే ఈ ప్రమాదాలు..

Aadhaar Card: మీ ఇంట్లో అనుమానస్పద వ్యక్తులు అద్దెకు ఉంటున్నారా..? వారి ఆధార్‌ నకిలీదా? కాదా..? గుర్తించండిలా