AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Huzurabad Tour: ఇవాళ హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. దళిబంధు పథకానికి శ్రీకారం.. మొదటి చెక్కు అందుకునేదీ ఎవరంటే?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది.

CM KCR Huzurabad Tour: ఇవాళ హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. దళిబంధు పథకానికి శ్రీకారం.. మొదటి చెక్కు అందుకునేదీ ఎవరంటే?
Balaraju Goud
|

Updated on: Aug 16, 2021 | 9:01 AM

Share

CM KCR Launched Dalita Bandhu Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి సీఎం కేసీఆర్ హుజురాబాద్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సభా స్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శాలపల్లిలో గ్రామంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పతకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం ముందుగా 15 మంది లబ్ధిదారులతకు సీఎం కేసీఆర్ స్వయంగా చెక్కులను పంపిణీ చేయనున్నారు. దళిత పథకం అమలు చేసే తీరును, దాని వల్ల కలిగే ప్రయోజాల గురించి ప్రజలకు వివరించనున్నారు సీఎం కేసీఆర్. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టారు. ఈ సభను దాదాపు లక్ష మందితో నిర్వహించనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి దళిత కుటుంబాలు తరలిరానున్నాయి.

శాలపల్లి ఇంద్రానగర్‌లో సోమవారం జరిగే సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 20 ఎకరాల్లో లక్షా 20వేల మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. సభా ప్రాంగణంలోని స్టేజీపై సుమారు 250 మంది కూర్చునే విధంగా సిద్ధం చేశారు. వర్షం వచ్చే సూచనలు ఉండడంతో ముందు జాగ్రత్తగా రెయిన్‌ఫ్రూఫ్‌ టెంట్లను వేస్తున్నారు. దళితబంధు పథకానికి హుజురాబాద్‌లో మొదట ఐదువేల కుటుంబాలను ఎంపిక చేశారు. ఇందుకోసం రూ. 500 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీఎం కేసీఆర్ సభ జరుగనుంది.

దళిత బంధు పథకాన్ని అన్ని పార్టీలు స్వాగతించినప్పటికీ.. ఉపఎన్నిక సమయంలో, అది కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొదటగా ఇవ్వడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక్క హుజూరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణ అంతటా దళితులందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, విపక్షాల అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని.. అర్హులైన అందరికీ దళిత బంధు అందుతుందని ఇప్పటికే మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మరోవైపు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా దూకుడు మీదున్నారు. హుజురాబాద్‌లో దళితులందరికీ పథకాన్ని వర్తింప జేయాలని లేదంటే దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో హజురాబాద్ దళిత బంధు ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారని.. విపక్షాల విమర్శలకు ఎలా కౌంటర్ ఇస్తారో అని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈటల రాజేందర్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరి రేపటి బహిరంగ సభలో ఈటలపై ఏమైనా విమర్శనాస్త్రాలు సంధిస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే సీఎం ప్రసంగంపై హుజురాబాద్‌తో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఆసక్తి నెలకొంది.

మరోవైపు, దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించే హుజూరాబాద్‌ మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి సీఎం సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై నీరు చేరి గుంతల మయంగా మారింది. కంకరతో గుంతలను అధికారులు పూడ్చివేయిస్తున్నారు. బురద మయమైన మట్టి రోడ్డుపై కంకర వేసి లెవలింగ్ చేయిస్తున్నారు.

Read Also….  Mynampally Hanumantha Rao: అర్ధరాత్రి ఎమ్మెల్యే మైనంపల్లి ఇంటి ముందు హైడ్రామా.. బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తల అరెస్ట్