Luxury cars: పేరుకేమో బడా బాబులు.. పైగా సొసైటీలో సెలబ్రిటీ హోదా.. కానీ, వీళ్ల కక్కుర్తి చూస్తే ఖంగు తినాల్సిందే!

పేరుకే పైసలున్నోళ్లు... కానీ, సర్కారు ఖజానాకు సున్నం పెడతారు. కోట్లు వెచ్చించి కార్లు కొనుగోలు చేస్తారు... కానీ, ట్యాక్స్ కట్టకుండా మోసాలకు పాల్పడతారు.

Luxury cars: పేరుకేమో బడా బాబులు.. పైగా సొసైటీలో సెలబ్రిటీ హోదా.. కానీ, వీళ్ల కక్కుర్తి చూస్తే ఖంగు తినాల్సిందే!
Luxury Cars
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 16, 2021 | 9:43 AM

Luxury cars in Hyderabad: పేరుకే పైసలున్నోళ్లు… కానీ, సర్కారు ఖజానాకు సున్నం పెడతారు. కోట్లు వెచ్చించి కార్లు కొనుగోలు చేస్తారు… కానీ, ట్యాక్స్ కట్టకుండా మోసాలకు పాల్పడతారు. రోల్స్ రాయిస్, ఫెరారీ లాంటి లగ్జరీ కార్లలో తిరుగుతారు… కానీ, గజదొంగలు కూడా సిగ్గుపడేలా ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తారు. ట్యాక్స్ కట్టకుండా.. తెలుగు రాష్ట్రాల రోడ్లపై లగ్జరీ కార్లలో స్వేచ్ఛగా తిరుగుతున్న వారిపై రవాణా శాఖ నజర్ పెట్టింది. గత ఆరు నెలలుగా నిఘా పెట్టి.. పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు దిగింది. రవాణా శాఖ ఉప కమిషనర్ డా.పాపారావు ఆధ్వర్యంలో 40మంది మోటార్ వెహికల్ అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు చేసి 11 లగ్జరీ కార్లను సీజ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను లగ్జరీ పన్నుకట్టకుండా హుందాగా ఖరీదైన కార్లలో తిరుగుతున్న వారి భరతం పట్టారు. సీజ్చేసిన వాహనాలు ద్వారా రూ.5 నుంచి 8 కోట్లు ప్రత్యక్షంగా.. దాదాపు రూ.100 కోట్లు పరోక్షంగా పన్ను వసూలు చేయనున్నారట రవాణా శాఖ అధికారులు. సీజ్ చేసిన కార్లలో మెర్సిడెజ్ బెంజ్, మాసరట్టి, ఫెరారి, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గిని వంటి కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అదిరిపోయే రేస్ కార్స్ ఇవి. ఒక్కో కారు రేట్… కో అంటే కోట్లు పలుకుతాయి. ఈ కార్లలో తిరగడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తారు… రయ్ రయ్ మంటూ ఈ కార్లు రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనాసరే చూపు తిప్పుకోలేరు… అందానికి అందం… లగ్జరీకి లగ్జరీ… వేగానికి వేగం ఇలా అన్నీ ఉంటాయి… ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది… కానీ, కోట్లు వెచ్చించి ఈ కార్లను కొనుగోలుచేసే ఈ బడా బాబులకు ట్యాక్స్ లు చెల్లించేందుకు మాత్రం మనసు రావడం లేదు. దొంగలు మాదిరిగా పన్నులు ఎగ్గొట్టి… ఎలాంటి అనుమతి పత్రాల్లేకుండానే దర్జాగా రోడ్లపై షికార్లు చేస్తున్నారు.

పన్నులు కట్టకుండా హైదరాబాద్ రోడ్లపై తిరుగుతోన్న బడా బాబులకు పోలీసులు, రవాణాశాఖ అధికారులు కలిసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ట్యాక్స్ లు చెల్లించకుండా అడ్డదారులు తొక్కినవాళ్లపై కొరఢా ఝలిపించారు. హైఎండ్ కార్లపై ఆరు నెలలుగా నిఘా పెట్టిన అధికారులు ఊహించనివిధంగా ఝలక్ ఇచ్చారు. ఏకకాలంలో నగరమంతటా తనిఖీలు నిర్వహించి లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా పదకొండు హైఎండ్ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన కార్ల ఓనర్స్ నుంచి ట్యాక్సులు, జరిమానా కింద సుమారు ఐదు కోట్ల మేర వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. పట్టుబడిన పది కార్లకే ఐదు కోట్ల వసూలుచేస్తే, మిగతా కార్లు కూడా దొరికితే పెద్దమొత్తంలో ట్యాక్స్ వసూలవుతోందని అంటున్నారు. ట్యాక్స్ లు ఎగ్గొట్టి తిరుగుతోన్న లగ్జరీ కార్లు చాలా ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. వాటన్నింటినీ గుర్తించే పనిలో పడ్డారు. ఈరోజు కాకపోతే రేపైనా చిక్కుతారు. కానీ, ఈలోపే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్యాక్స్ లు చెల్లించాలని సూచిస్తున్నారు.

విదేశీ లగ్జరీ కార్స్ ద్వారా ప్రభుత్వానికి వంద కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉంది. అయితే, ఇంపోర్ట్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ ను తప్పించుకోవడానికి బడా బాబులు అక్రమాలకు పాల్పడుతున్నారు. కోట్లల్లో కట్టాల్సిన ట్యాక్సుల్ని ఎగ్గొట్టేందుకు రాయబారుల పేరిట కార్లను కొనుగోలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ ట్యాక్స్ లు ఎగ్గొడుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల భరతం పడుతున్నారు ఇప్పుడు అధికారులు.

ఇతర రాష్ట్రాల నుంచి హైఎండ్ లగ్జరీ కార్లు కొన్న యజమానులు రాష్ట్రానికి రావాల్సిన పన్ను చెల్లించాలి. పన్ను చెల్లించకుండా తిరిగితే వాహనాలను సీజ్‌ చేస్తామని రవాణా శాఖ ఉప కమిషనర్ పాపారావు హెచ్చరించారు. రవాణా శాఖ చరిత్రలో ఇలాంటి దాడులు జరగడం ఇదే తొలిసారి. శ్రీమంతులు, పలుకుబడి ఉన్న వారు వినియోగించే వాహనాలను సీజ్ చేయడంపై పలువురు రవాణాశాఖ అధికారులను ప్రశంసిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Read Also….  Independence Day: టైమ్స్ స్క్వేర్‌లో ఇండిపెండ్స్ డే సెలబ్రేషన్స్.. భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రవాసాంధ్రులు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!