హీరోహీరోయిన్లపై మండిపడ్డ సీనియర్ యాక్టర్ నవాజుద్దీన్.. కొంచెమైనా సిగ్గుండాలి అంటూ ఫైర్..

Nawazuddin Siddiqui: ఇండియా.. కరోనా సృష్టిస్తున్న మారణ హోమంతో అల్లాడిపోతుంది. రోజూ లక్షల్లో మరణాలతో స్మశానాలు

హీరోహీరోయిన్లపై మండిపడ్డ సీనియర్ యాక్టర్ నవాజుద్దీన్.. కొంచెమైనా సిగ్గుండాలి అంటూ ఫైర్..
Nawazuddin Siddiqui
Rajitha Chanti

|

Apr 25, 2021 | 3:13 PM

Nawazuddin Siddiqui: ఇండియా.. కరోనా సృష్టిస్తున్న మారణ హోమంతో అల్లాడిపోతుంది. రోజూ లక్షల్లో మరణాలతో స్మశానాలు సైతం రద్దీగా మారిపోయాయి. ఇక పలు చోట్ల ఆసుపత్రిలలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ అందక ఎంతో మంది కరోనా పేషెంట్స్ అవస్థలు పడుతున్నారు. ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో చీకట్లకు నింపడమే కాకుండా… పిల్లలకు పెద్దవారిని.. వృద్దులకు పిల్లలను దూరం చేసి అనాధలుగా మారుస్తోంది. ఒకవైపు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పై పోరాటం చేస్తుండగా.. మరోవైపు బాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రం హాయిగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మరి కారణంగా నిబంధనలు మరింత కఠినతరం చేయడం.. షూటింగ్స్ నిలిచిపోవడంతో.. బాలీవుడ్ ప్రేమ జంటలు.. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్.. దిశాపటాని, టైగర్ ష్రాఫ్‌లతో పాటు.. హీరోయిన్ శ్రద్ధా కపూర్, మాధురీ దీక్షిత్ ఎంచక్కా మాల్దీవులలో హాలీడేలు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాక.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఓవైపు దేశమంతా కరోనా కారణంగా అట్టుడికిపోతుంటే.. మీకు విహారయాత్రలు కావాల్సి వచ్చాయా.. అంటూ వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Celebs

Celebs

తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కూడా సెలబ్రెటీల తీరుపై మండిపడ్డారు. ఓ వైపు ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదురుకుంటుంటే. వీళ్ళు హాలీడేలు ఎంజాయ్ చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ‘మాల్దీవుల్లో వీళ్లు చేసే తమాషా ఏంటో నాకు అర్థం కాదు. ఓవైపు ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదురుకుంటుంది. కానీ, వీళ్లు ఎంచక్కా వాళ్ల ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రజలు ఆహారం దొరకకుండా ఇబ్బంది పడుతుంటే వీళ్లు మాత్రం డబ్బుని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కొంచం అయినా సిగ్గుండాలి’ అంటూ నవాజుద్దీన్ అన్నారు.

Also Read: HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..

ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu