Tumbbad 2: ‘తుంబాడ్ 2’ వచ్చేస్తోంది.. భయపెట్టడానికి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. సమంత, జాన్వీని కాదని..
'తుంబాడ్' సినిమా ఓటీటీలు, పైరసీ సైట్ల ద్వారా ఎక్కువ మందికి చేరి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటీవల మళ్లీ థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఈ క్రేజీ హారర్ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో ప్రధాన పాత్ర కోసం నటి ఆలియా భట్‌ను ఎంపిక చేయడం విశేషం.

‘తుంబాడ్’ భారతీయ సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రం. అనేక అడ్డంకులు, సమస్యల తర్వాత 2018లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాలక్రమేణా, ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెల్చుకుంది. OTTలు, పైరసీ సైట్ల ద్వారా ఇది మరింత ఎక్కువ మందికి చేరి, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇటీవల, ఈ చిత్రాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేయగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ఇప్పుడు ఇందులో ప్రధాన పాత్ర కోసం నటి ఆలియా భట్‌ను ఎంపిక చేయడం విశేషం. ‘తుంబాడ్ 2’ రాబోతోందన్న వార్త పాతదే. కానీ, ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తుందనే దానిపై చాలా గందరగోళం నెలకొంది. ఈ వార్తల్లో ప్రధానంగా సమంత పేరే వినిపించింది. ‘తుంబాడ్ 2’ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరునే నిర్మిస్తారనే బలమైన పుకారు కూడా వచ్చింది. అలాగే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడు కథానాయికగా ఆలియా భట్‌ను అధికారికంగా ఎంపిక చేశారు.
ప్రముఖ హారర్ చిత్రం ‘తుంబాడ్’కు సీక్వెల్‌గా వస్తున్న, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంలో ఆలియా భట్ నటిస్తున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత సోహమ్ షా ధృవీకరించారు. సోహమ్ షా తన సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను పంచుకుంటూ ఆలియాకు ఈ చిత్రంలోకి స్వాగతం పలికారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ, సోహమ్ షా ఇలా రాశారు, ‘ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ‘తుంబాడ్ 2’లోకి ఆలియా భట్ ‘ప్రళయ దాటి’కి స్వాగతం. థియేటర్లలో కలుద్దాం’ అని రాసుకొచ్చారు.
‘తుంబాడ్ 2’లో నటించడానికి అంగీకరించడానికి గల కారణాన్ని వివరిస్తూ, ఆలియా భట్ ఆ సినిమా మొదటి భాగం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. ”తుంబాడ్’ చూసినప్పటి నుండి అది నా మనసులో నిలిచిపోయింది. అలాంటి అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి, విడుదలైన సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా ప్రజల జ్ఞాపకాలలో నిలిచిపోతుంది. అందుకే ఈ అవకాశం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది, అందుకే నేను అంగీకరించాను,’ అని ఆమె అన్నారు.
ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలియా భట్, సోహమ్ షా మరియు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. సోహమ్ షా ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2027 డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుంది. యాదృచ్ఛికంగా, ‘తుంబాడ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహి అనిల్‌ను ఈ చిత్రం నుంచి తొలగించారు.
హస్తర్ బొమ్మతో అలియా భట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




