AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలలో కనిపించిన బంగారం.. నిజంగానే దొరికింది! గ్రాముల్లో కాదు.. 27 కిలోలు! దెబ్బకు తలరాత మారిపోయింది..

ఆస్ట్రేలియాకు చెందిన కెవిన్ హిల్లియర్‌కు కలలో కనిపించిన భారీ బంగారు ముద్ద, కేవలం 12 రోజుల తర్వాత నిజంగానే దొరికింది. 27 కిలోల బంగారు ముద్దను కనుగొన్న ఆయన, దాన్ని మిలియన్ల డాలర్లకు విక్రయించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కలలో కనిపించిన బంగారం.. నిజంగానే దొరికింది! గ్రాముల్లో కాదు.. 27 కిలోలు! దెబ్బకు తలరాత మారిపోయింది..
27 Kgs Gold
SN Pasha
|

Updated on: Jul 14, 2026 | 9:47 PM

Share

సాధారణంగా తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ఈ మాట మీరు కూడా వినే ఉంటారు. అలాగే కలలో నిధి కనిపించిందని తవ్వకాలు జరిపేవారు కూడా ఉన్నారు. అయితే నిజంగానే కలలు నిజమవుతాయా? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియాకు చెందిన కెవిన్ హిల్లియర్ కథ ఆసక్తికరమైన ఉదాహరణగా నిలుస్తుంది. 1980లో అతనికి వచ్చిన ఒక విచిత్రమైన కల, కేవలం 12 రోజుల తర్వాత నిజమై అతడిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. ఒకటి కాదు రెండు ఏకంగా 27 కిలోల భారీ బంగారు ముద్ద అతనికి దొరికింది. అది ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత ప్రసిద్ధ బంగారు ఆవిష్కరణల్లో ఒకటిగా నిలిచింది.

అన్వేషణ సాగించాడు.. సక్సెస్ అయ్యాడు

1980లో ఒక రాత్రి కెవిన్ హిల్లియర్‌కు భారీ, వింత ఆకారంలో ఉన్న బంగారు ముద్ద కలలో కనిపించింది. ఆ కల ఎంతో స్పష్టంగా అనిపించడంతో నిద్రలేచిన వెంటనే దాని ఆకారాన్ని ఒక కాగితంపై గీశాడు. అంతేకాదు, తాను నిజంగానే ఈ కలను చూశానని తర్వాత నిరూపించేందుకు ఆ చిత్రంపై తన పొరుగువారితో సాక్షిగా సంతకం కూడా చేయించుకున్నాడు. ఆ కల వచ్చిన సరిగ్గా 12 రోజుల తర్వాత, 1980 సెప్టెంబర్ 26న కెవిన్ తన భార్యతో కలిసి ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని వెడ్డర్‌బర్న్ సమీపంలో మెటల్ డిటెక్టర్‌తో బంగారం కోసం అన్వేషణ చేస్తుండగా భూమిలో పాతిపెట్టిన భారీ బంగారు ముద్దను గుర్తించాడు. దానిని బయటకు తీసి శుభ్రం చేయగా దాని బరువు సుమారు 27 కిలోగ్రాములు ఉన్నట్లు తేలింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ బంగారు ముద్ద ఆకారం అతడు కలలో చూసి కాగితంపై గీసిన చిత్రానికి దాదాపు సరిపోవడంతో దానికి హ్యాండ్ ఆఫ్ ఫెయిత్ అని పేరు పెట్టారు.

ఆ లైసెన్స్ ఉండటం మంచిదైంది..

ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ప్రభుత్వ అనుమతితో మైనర్స్ రైట్ (Miner’s Right) లైసెన్స్ పొందిన వ్యక్తులు అనుమతించిన ప్రాంతాల్లో మెటల్ డిటెక్టర్ ద్వారా లభించే బంగారాన్ని చట్టబద్ధంగా సొంతం చేసుకోవచ్చు. కెవిన్ వద్ద ఆ లైసెన్స్ ఉండటంతో ఆ బంగారు ముద్దపై అతనికే హక్కు లభించింది. తర్వాత కెవిన్ ఆ చారిత్రాత్మక బంగారు ముద్దను అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న గోల్డెన్ నగ్గెట్ క్యాసినోకు మిలియన్ల డాలర్లకు విక్రయించాడు. ప్రస్తుతం కూడా ఆ బంగారు ముద్ద అక్కడే ప్రజల సందర్శన కోసం ప్రదర్శనలో ఉంది. కెవిన్ హిల్లియర్ కథ ప్రపంచవ్యాప్తంగా బంగారం అన్వేషకులకు స్ఫూర్తిగా నిలిచింది. ఒక సాధారణ వ్యక్తి కల నుంచి ప్రారంభమైన ఈ సంఘటన, అదృష్టం, పట్టుదల, సరైన అవకాశం కలిస్తే జీవితం ఎలా మారిపోతుందో చూపించే అరుదైన ఉదాహరణగా గుర్తింపు పొందింది.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..