AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోయి‏న్‏కు వేధింపులు.. ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి టార్చర్.. పోలీసులకు ఫిర్యాదు..

సాధారణంగా సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. అలాగే నెట్టింట హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని వేధించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈమధ్య ఏఐ ప్రపంచంలో తారల వ్యక్తిగత ఫోటోలను ఇష్టానుసారంగా మార్ఫింగ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఇదివరకే టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లకు సంబంధించిన ఫోటోస్ మార్ఫింగ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ సైతం అలాంటి పరిస్థితి ఎదుర్కొంది.

Tollywood : హీరోయి‏న్‏కు వేధింపులు.. ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి టార్చర్.. పోలీసులకు ఫిర్యాదు..
Anna Rajan
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2026 | 9:58 PM

Share

సినీతారలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు సైబర్ వేధింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏఐ ప్రపంచంలో హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారు. ఏఐ ఉపయోగించి హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇదివరకే బాలీవుడ్, టాలీవుడ్ తారల ఫోటోస్ మార్ఫింగ్ చేసిన సంఘటనలు చూస్తున్నాం. తాజాగా మలయాళీ హీరోయిన్ అన్నా రేష్మా రాజన్ ఫోటోస్ సైతం మార్ఫింగ్ చేశారు. సోషల మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించారు హీరోయిన్ అన్నా రేష్మా. తన ప్రమేయం లేకుండా తన ఫోటోను అసభ్యకరంగా మార్పింగ్ చేసి ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వ్యక్తిపై ఆమె మండిపడ్డారు. ఈమేరకు అతడి ఇన్ స్టా ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ కేరళ పోలీసులకు, సైబర్ సెల్ కు ఆమె ఫిర్యాదు చేశారు.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

“ఈ నీచమైన చర్య నా గౌరవానికి, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్ ను సృష్టించేవారైనా .. దానిని ఇతరులతో పంచుకునే వారైనా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. ఈ ఇన్ స్టా ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను. చట్టపరంగా ముందడుగు వేస్తాను ” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం అన్నా రేష్మా రాజన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

అయితే అన్నా రేష్మా రాజన్ ఇలా సైబర్ దాడికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని నెటిజన్స్ విమర్శలు గుప్పించారు. అలాగే ఆమె బాడీ షేమింగ్ కు గురయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేశారు. 2017లో లీజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ అంగమాలి డైరీస్ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో అన్నా రాజన్ చాలా పాపులర్.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

అన్నా రాజన్ ఫోటో..

View this post on Instagram

A post shared by Anna raajan (@annaspeeks)

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం