Manoj Kumar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత..
సినీరంగంలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్ను మూశారు. 87 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ నటుడు, సినీదర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. మనోజ్ కుమార్ ముఖ్యంగా దేశభక్తికి ప్రసిద్ధి చెందారు. అందుకే అతడిని భరత్ కుమార్ అని పిలుస్తారు. దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా నటించారు. మనోజ్ కుమార్ మృతిపై సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
జూలై 24, 1937న జన్మించారు మనోజ్ కుమార్. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. మనోజ్ కుమార్ సినీరంగంలో ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తిదాయకం. “షహీద్” (1965), “ఉప్కార్” (1967), “పురబ్ ఔర్ పశ్చిమ్” (1970) , “రోటీ కప్దా ఔర్ మకాన్” (1974) వంటి అనేక దేశభక్తి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైన నటనతో మెప్పించారు.
భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను మనోజ్ కుమార్ కు 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. నటుడిగా, దర్శకుడిగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అతని దేశభక్తి చిత్రాలతో పాటు, అతను “హరియాలీ ఔర్ రాస్తా”, “వో కౌన్ థీ”, “హిమాలయ్ కి గాడ్ మే”, “దో బదన్”, “పత్తర్ కే సనమ్”, “నీల్ కమల్” మరియు “క్రాంతి” వంటి అనేక గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
Indian actor and film director Manoj Kumar, particularly known for his patriotic films and the nickname 'Bharat Kumar', passes away at the age of 87 at Kokilaben Dhirubhai Ambani Hospital. pic.twitter.com/nHvvVDT2CY
— ANI (@ANI) April 4, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..