Harnaaz Sandhu: అందువల్లే బరువు పెరిగాను.. తనకున్న అనారోగ్య సమస్యను బయటపెట్టిన మిస్ యూనివర్స్..

Miss Universe Harnaaz Sandhu: గతేడాది ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హర్నాజ్‌ సంధూ కౌర్‌. పోటీలకు ముందు ఎలాంటి అంచనాలు లేని ఈ పంజాబీ మోడల్‌

Harnaaz Sandhu: అందువల్లే బరువు పెరిగాను.. తనకున్న అనారోగ్య సమస్యను బయటపెట్టిన మిస్ యూనివర్స్..
Harnaaz Kaur Sandhu
Follow us

|

Updated on: Apr 01, 2022 | 5:28 PM

Miss Universe Harnaaz Sandhu: గతేడాది ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హర్నాజ్‌ సంధూ కౌర్‌. పోటీలకు ముందు ఎలాంటి అంచనాలు లేని ఈ పంజాబీ మోడల్‌ సుమారు రెండు దశాబ్దాల అనంతరం మన దేశానికి విశ్వ సుందరి కిరీటాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఓ పంజాబీ సినిమాలో నటించిన ఆమె కొన్ని రోజుల క్రితం గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీబీబీ జవాన్ల కుటుంబ సభ్యులు, వారి పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేసింది. కాగా ఇటీవల హిజాబ్‌పై తన అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ వార్తల్లో నిలుస్తోన్న ఆమె.. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి మరోసారి టాప్‌ ఆఫ్‌ ది టాన్‌ అయింది. కాగా తన ఫ్యాషన్‌ వీక్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా.. కొందరు నెటిజన్ల నుంచి ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. అందాల పోటీల తర్వాత బరువు పెరుగుతున్నావంటూ, లావుగా కనిపిస్తున్నావంటూ ట్రోలింగ్‌ చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్నాజ్‌ బాడీ షేమింగ్‌ (Body Shaming) కామెంట్లపై స్పందించింది. ఈ సందర్భంగా తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది.

గోధుమ, గ్లూటెన్‌ ఐటమ్స్‌ తినకూడదు..

‘శరీర ఆకృతి కారణంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న వారిలో నేను ఉన్నాను. మొదట నన్ను చాలా సన్నగా ఉన్నావనేవారు. ఇప్పుడేమో లావుగా ఉన్నావంటున్నారు. అయితే.. ఎవరికీ నాకున్న సెలియాక్ వ్యాధి (Celiac disease) గురించి తెలియదు. ఈ సమస్య కారణంగా నేను గోధుమ పిండితో చేసిన పదార్థాలు, వంటకాలు అసలు తినకూడదు. అదేవిధంగా గ్లూటెన్‌ పదార్థాలు తింటే నా రోగనిరోధక శక్తి వ్యవస్థ దెబ్బతింటుంది. నిజానికి.. ఎవరైనా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళితే వారి శరీరంలో మార్పు రావడం సహజం. నేను మొట్టమొదటిసారి న్యూయార్క్ వెళ్లాను. అది పూర్తిగా వేరే ప్రపంచం. అందుకే నా శరీరాకృతిలోనూ మార్పు వచ్చింది. ఇక మరో విషయమేమిటంటే.. నేను బాడీ పాజిటివిటీని బాగా నమ్ముతాను. ఆ సానుకూల దృక్పథంతోనే మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని గెల్చుకున్నాను. ఆ పోటీలో కూడా నేను మహిళా సాధికారత, బాడీపాజిటివిటీ గురించి మాట్లాడాను. ఇక నేను కేవలం అందంగా ఉండడం వల్లే విశ్వసుందరి టైటిల్‌ గెలిచానని మీరు భావిస్తున్నారేమో. అదేం లేదు. నేను అందంగా ఉండడం వల్ల కాదు. నాలోని ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం వల్ల ఆ కిరీటం సొంతం చేసుకున్నాను. నేను లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఇది నా శరీరం. నన్ను నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నాలో వచ్చే మార్పులను కూడా ప్రేమిస్తూనే ఉంటాను. ఇక్కడ నాలాగే ఎంతోమంది బాడీ షేమింగ్‌కి గురవుతూ ఉంటారు. అలాంటివారందరికీ నేను ఒక్కటే చెబుతున్నా… నాతోపాటు మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. ట్రోలింగ్‌ గురించి పట్టించుకోకండి’ అని తనలాంటి బాధితుల్లో స్ఫూర్తి నింపింది హర్నాజ్‌.

Also Read:Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఈ నగరాల మధ్యే

Weight Loss Tips: వేసవిలో బరువు తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు..!

Relationship: భార్యాభర్తలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే విడాకులే..!