ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. త్వరలో బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. త్వరలో బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌..!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం..

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

May 09, 2020 | 7:49 PM

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన 31వ మూవీని అనౌన్స్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్.. ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇక ఈ రెండు చిత్రాల అనంతరం కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి అన్ని సంప్రదింపులు పూర్తి అయినట్లు టాక్‌. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు(మే 20) రానున్నట్లు ఫిలింనగర్‌లో పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌ను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో నిజమెంతో మరో 10 రోజుల్లో తేలనుంది. కాగా కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఈ దర్శకుడు యశ్‌తో కేజీఎఫ్‌ 2ను తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ మూవీని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read this Story Also: మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన దుల్కర్‌.. దర్శకుడు ఎవరంటే..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu