కోటి ఆశలతో సినిమా ప్రయాణం. గమ్యం చేరేవరకు కష్టమే అతడి ఆయుధం. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించాడు మహేశ్. ఇప్పుడు వెండితెరపై తనకంటూ ఓ సెపరేట్ ఐడెంటీని క్రియేట్ చేసుకున్నాడు. దర్శకులు అతడి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా క్యారెక్టర్లు రాసుకుంటున్నారు అంటే..మహేశ్ తన నటనతో ఎంత మ్యాజిక్ చేశాడో అర్థమవుతుంది. ‘శతమానం భవతి’, ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలు మహేశ్ కెరీర్ ని మరో టర్న్ తిప్పాయి. కాళ్లు అరిగేలా సినిమా ఆఫీసులకు తిరిగి..జబర్థస్త్ లో మొదట చిన్నా, చితకా వేశాలు వేసి..ఒక్కటేమిటి తన ఇప్పుడు ముఖంపై వేస్తున్న మేకప్ మాటున ఎన్నో కన్నీటి మరకలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు మనం మహేశ్ జీవితంలో ఓ శుభపరిణామం గురించి మాట్లాడుకోబోతున్నాం
ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ..ఫుల్ బిజీగా ఉన్న మహేష్ త్వరలో ఓ ఇంటివాడుకాబోతున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా మహేశే కన్ఫామ్ చేశాడు. తన దగ్గరి బంధువుల అమ్మాయి మెడలో త్వరలో మూడు ముళ్లు వేయబోతున్నాడు ఈ నటుడు. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయని సమాచారం. పెళ్లి తర్వాత అతని ఫిల్మ్ కెరీర్ మరింత సక్సెస్ కావాలని ఆశిద్దాం.