AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: 100 శాతం పక్కా! రామ్ ప్రసాద్‌తో పాటు బిగ్‌ బాస్‌ 10లోకి ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్ కూడా..

బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గొడవలు, టాస్కులే కాదు ఎంటర్ టైన్మెంట్ కూడా ముఖ్యమే. అందుకే జబర్దస్త్ కమెడియన్లకు ఈ రియాలిటీ షోలో ప్రత్యేక స్థానం ఉంటుంది. పదో సీజన్ కు సంబంధించి ఇప్పటికే రామ్ ప్రసాద్ ఫేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో జబర్దస్త్ నటుడు కూడా బిగ్ బాస్ లోకి రావడం పక్కా అని టాక్.

Bigg Boss Telugu 10: 100 శాతం పక్కా! రామ్ ప్రసాద్‌తో పాటు బిగ్‌ బాస్‌ 10లోకి ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్ కూడా..
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Aug 25, 2026 | 8:31 PM

Share

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్‌కు ముస్తాబవుతోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి కొత్తగా షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దశావతారం కాన్సెప్ట్‌తో కొత్త కొత్త టాస్కులు, రూల్స్ తో బిగ్ బాస్ సీజన్‌ 10ను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సామాన్యుల కోసం నిర్వహిస్తోన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 దాదాపు ఎండింగ్ కు చేరుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో పదో సీజన్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా పేర్లే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గొడవలు, టాస్కులే కాదు ఎంటర్ టైన్మెంట్ కూడా ముఖ్యమే. ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేసే వారికి ఈ రియాలిటీ షోలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్లకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

గతంలో ఇమ్మాన్యుయేల్, ముక్కు అవినాష్, రోహిణి, ఫైమా.. ఇలా చాలా మంది జబర్దస్త్ కమెడియన్లు బిగ్ బాస్ లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 10లోనూ జబర్దస్త్ కమెడియన్లకు ప్రత్యేక స్థానం ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ ప్రసాద్ పేరు కన్ఫార్మ్ లిస్టులో ఉందని టాక్. ఇప్పుడు ఇదే జాబితాలో మరో జబర్దస్త్ టాప్ నటుడు కూడా చేరాడని తెలుస్తోంది. అతను మరెవరో కాదు పొట్టి నరేష్.

రామ్ ప్రసాద్ తో కలిసి రచ్చ చేయనున్న పొట్టి నరేష్..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నరేష్ జీవితంలో పలు ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. శారీరక ఎదుగుదల లోపం వల్ల సమాజం నుంచి ఛీత్కరింపులు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే నరేష్ మాత్రం కుంగిపోలేదు. తన ఎత్తును, రూపాన్ని నెగెటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగు పెట్టి తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కూడా చేసిన నరేష్ బిగ్ బాస్ లోకి వస్తే మంచి ఎంటర్ టైన్మెంట్ దొరుకుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే బిగ్ బాస్ మేకర్స్ నరేష్ ను సంప్రదించారని, ఈ జబర్దస్త్ కమెడియన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us