Bigg Boss Beauty: నాపై యాసిడ్ దాడికి ప్లాన్ చేశాడు.. ఎక్స్ లవర్‌పై సంచలన కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ..

Bigg Boss Beauty: బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ అక్షర సింగ్ సంచలన కామెంట్స్ చేసింది. తన జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలన్నీ వెల్లడించిన అక్షర.. ఓ వ్యక్తితో బ్రేకప్ కారణంగా..

Bigg Boss Beauty: నాపై యాసిడ్ దాడికి ప్లాన్ చేశాడు.. ఎక్స్ లవర్‌పై సంచలన కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ..
Bigg Boss Ott Akshara
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 13, 2021 | 1:16 PM

Bigg Boss Beauty: బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ అక్షర సింగ్ సంచలన కామెంట్స్ చేసింది. తన జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలన్నీ వెల్లడించిన అక్షర.. ఓ వ్యక్తితో బ్రేకప్ కారణంగా తానెన్ని ఇబ్బందులకు గురయ్యిందో తెలిపింది. అక్షర సింగ్ తన మాజీ ప్రియుడితో విడిపోయిన తర్వాత తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించాడని, ఇందుకోసం ఒక సుపారీ గ్యాంగ్‌ను నియమించాడని ఆరోపించింది. భోజ్‌పురి నటి అక్షరా సింగ్.. బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. చాలా లైఫ్ థ్రెట్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.

‘‘నన్ను చంపేస్తామని, కెరీర్‌ను నాశనం చేస్తామని చాలా బెదిరింపులు వచ్చాయి. కానీ మా నాన్న ఇచ్చిన ధైర్యంతో మానసికంగా చాలా దృఢంగా మారాను. ఇబ్బంది పెట్టే అంశాల గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాను. నా ప్రాణాలును కూడా లెక్కచేయలేదు. అప్పటికే నేను చాలా సమస్యలను ఫేస్ చేశాను. నీ గొంతు కోసేస్తా.. చంపేస్తా అంటూ బెదిరించారు. దమ్ముంటే చంపేయండి అని అన్నాను. నా మాజీ ప్రియుడు కొంతమంది అబ్బాయిల ద్వారా యాసిడ్ బాటిల్‌తో దాడి చేయించి, నా కెరీర్‌ను నాశనం చేసే ప్రయత్నం చేశాడు. నా జీవితంలో నేను బాధపడినట్లు.. మరే స్త్రీ కూడా ఇంతలా బాధపడొద్దని దేవుడిని ప్రార్థిస్తున్నాను. డిప్రెషన్‌తో పోరాడి ప్రస్తుతానికి కోలుకున్నాను.’’ అంటూ అక్షరా సింగ్ చెప్పుకొచ్చింది.

బిగ్‌ బాస్ ఓటీటీ నుంచి అక్షరా సింగ్ ఇటీవలె ఎలిమినేట్ అయ్యింది. అక్షర ఉన్నన్ని రోజులు తన చర్యలతో అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. షమితా శెట్టి, మూస్ జట్టానాతో కలిసి సరదాగా బిగ్ బాస్ హౌస్‌ను షేక్ చేసింది. అయితే, సీజన్ ప్రారంభంలో మిలింగ్ గబా, నిశాంత్ భట్, నేహా భాసిన్, రాకేష్ బాపట్, ప్రతీక్ సెహజ్‌ పాల్‌తో తన కెరీర్‌పై మూస్ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదని అక్షర చెప్పింది.

‘‘డిన్నర్ చేయడం కోసం మిలింద్ గబా ఎక్కడున్నారో చూడమని మూస్‌ని అడిగాను.. కానీ, ‘గబే మేరే గా.. హై’ అని చెప్పింది. ఆ పదం నాకు అస్సలు నచ్చలేదు. మూస్ నాతో స్నేహంగా ఉంటుంది. కానీ, ఆమె చేసిన ఆ వ్యాఖ్య నాకు నచ్చలేదు. ఆమె నా పని గురించి ఒక కామెంట్ చేసింది. అది కూడా నాకు నచ్చలేదు.’’ అని ఇంటర్వ్యూలో మొత్తం వివరించింది అక్షరా సింగ్.

Also read:

Bank of India: ఆ ఖాతాలో శాలరీ పడితే కోటి రూపాయల ప్రయోజనాలు.. పూర్తి వివరాలు ఇవే..

NBK 107 Movie : బాలయ్యలో రౌడీయిజాన్ని బయటకు తీయనున్నాడట.. గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ ఇదేనా..

Miracle Plant: మన ఇంటి సంజీవని.. ఈ మొక్క ఇంట్లో ఉంటే డాకర్ మీదగ్గర ఉన్నట్లే.. ఈ ఆకుతో పైల్స్‌కు శాశ్వతంగా చెక్