Bank of India: ఆ ఖాతాలో శాలరీ పడితే కోటి రూపాయల ప్రయోజనాలు.. పూర్తి వివరాలు ఇవే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI). వారి కోసం ప్రత్యేక ఖాతాను ప్రవేశపెట్టింది ఆ బ్యాంక్. BOI ప్రభుత్వ ఉద్యోగుల కోసం శాలరీ ప్లస్ అకౌంట్...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI). వారి కోసం ప్రత్యేక ఖాతాను ప్రవేశపెట్టింది ఆ బ్యాంక్. BOI ప్రభుత్వ ఉద్యోగుల కోసం శాలరీ ప్లస్ అకౌంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ శాలరీ ప్లస్ అకౌంట్ కస్టమర్‌లు ఈ పథకంలో ఉచితంగా కోటి రూపాయల వరకు ప్రయోజనాలను పొందేలా ఈ పథకాన్ని బ్యాంక్ డిజైన్ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఈ ప్రత్యేక శాలరీ ప్లస్ అకౌంట్ గురించిన వివరాలను తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. బ్యాంక్ BOI శాలరీ ప్లస్ అకౌంట్ పథకం కింద మూడు రకాల జీతాల ఖాతా సౌకర్యం ఉంది. పారా మిలటరీ ఫోర్స్, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్, యూనివర్సిటీ, కాలేజ్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు జీతం అకౌంట్ స్కీమ్ ఉంది.
శాలరీ ఖాతాను జీరో-బ్యాలెన్స్ ఖాతా అని కూడా తెలిపింది. అందుకే శాలరీ ఖాతాను నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. శాలరీ ఖాతాలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
రూ. కోటి వరకు ఉచిత ప్రమాద బీమా
BOI సాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ కింద వినియోగదారులకు రూ .1 కోటి వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద జీతం అకౌంట్ ఉన్న ఖాతాదారులకు బ్యాంక్ రూ. 30 లక్షల వరకు ప్రమాదవశాత్తు డెత్ కవర్ అందిస్తోంది. బ్యాంక్ ట్వీట్ ప్రకారం జీతం అకౌంట్ హోల్డర్‌కు రూ .1 కోటి ఉచిత విమాన ప్రమాద బీమా ఇవ్వబడుతోంది.
ఈ సదుపాయాన్ని పొందుతారు
>> వేతన ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. BOI శాలరీ ప్లస్ ఖాతా పథకం కింద రూ .2 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తోంది. మీ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా మీరు రూ .2 లక్షల వరకు విత్‌డ్రా చేయవచ్చు.
>> BOI శాలరీ ఖాతాదారునికి గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డును ఉచితంగా ఇస్తోంది.
>> ఇది కాకుండా కస్టమర్‌లు ఏటా 100 చెక్ లీవ్‌లను ఉచితంగా పొందుతారు. అలాగే “డీమాట్” అకౌంట్‌లపై AMC ఛార్జీలు విధించబడవు.
ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శాలరీ అకౌంట్..
ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌండట్ ప్రయోజనాలను అందిస్తోంది. నెలకు రూ. 10,000 సంపాదిస్తున్న వారు ఈ పథకం కింద శాలరీ ఖాతాను తెరవవచ్చు. కనీస బ్యాలెన్స్ కూడా అవసరం లేదు.
జీతం అకౌంట్ హోల్డర్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ రూ. 5 లక్షలు పొందుతాడు. ఇందులో ప్రతిఒక్కరూ ఉచితంగా గ్లోబల్ డెబిట్ కమ్ ATM పొందుతారు.
ఇవి కూడా చదవండి: Altcoins: ఆల్ట్‌కాయిన్‌లపై పెట్టుబడి పెడితే బిట్‌కాయన్‌ను మించిన లాభాలు.. ఈ ఏడాది 8000 శాతం రాబడి..
Zomato: ఈ నెల17 నుంచి నిత్యావసరాల సేవలు బంద్.. కీలక ప్రకటన చేసిన జొమాటో