Animal Farmers: పాడి రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటే సులువుగా లభిస్తుంది..
Animal Farmers Loan Scheme: దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే ఇప్పటికి చాలామందికి వ్యవసాయమే జీవనాధారం.
Animal Farmers Loan Scheme: దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే ఇప్పటికి చాలామందికి వ్యవసాయమే జీవనాధారం. అందులో పశుపోషణ కూడా ఒక భాగం. అందుకే ప్రభుత్వం పశుపోషణపై ప్రత్యేక దృష్టి సారించింది. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి ( AHIDF) రూ .15000 కోట్లు కేటాయించింది. దీని ద్వారా పాడి రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తుంది. ఇందుకోసం ఉదయమిమిత్ర పోర్టల్‌ను సందర్శించి పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేసే పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పశుసంవర్ధక శాఖ మీ దరఖాస్తును పరిశీలిస్తుంది. డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి పొందిన తర్వాత బ్యాంక్ రుణం మంజూరు చేస్తుంది. డబ్బులు నేరుగా మీ ఖాతకు బదిలీ చేస్తారు.
ఈ యూనిట్లను ఏర్పాటుకు రుణాలు మంజూరు చేస్తుంది..
1. వ్యవసాయ సంబంధిత పనులు చేసే సంస్థల ఏర్పాటుకు రుణాలు అందిస్తుంది. 2. ఐస్ క్రీమ్ యూనిట్ ఏర్పాటు 3. పనీర్ తయారీ యూనిట్ 4. రుచికరమైన పాల కోసం యూనిట్ల ఏర్పాటు 5. అల్ట్రా హై టెంపరేచర్ నే టెట్రా ప్యాకేజింగ్ సౌకర్యాలతో పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు. 6. పాలపొడి తయారీ యూనిట్ ఏర్పాటు 7. వెయ్ పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు 8. వివిధ రకాల మాంసం ప్రాసెసింగ్ కోసం
ప్రణాళిక లక్ష్యం పశుపోషణ ప్రోత్సహించడం ద్వారా పాడి రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా పాలు, మాంసం ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుతుంది. వినియోగదారులకు నాణ్యమైన పాలు, మాంసం ఉత్పత్తులను అందించవచ్చు. దేశంలో పెరుగుతున్న జనాభా ప్రోటీన్ అవసరాలను తీర్చవచ్చు. పోషకాహార లోపంతో పోరాడటానికి సహాయం చేయవచ్చు. పశుసంవర్ధక ప్రోత్సాహంతో దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పాలు, మాంసం రంగంలో ఎగుమతులు మరింత పెరుగుతాయి.