Viral Video: మందుబాబులకు తలతిరిగిపోయే సమాధానమిచ్చిన ఆవు..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Funny Video: మందుబాబులు ఉన్నట్టుండి ఎక్కడికైనా వెళితే ముందుగా ఆ ప్రాంతంలో మద్యం కోసం వెతుకుతారు. అక్కడ కనిపించిన వారందరిని ఇక్కడ మద్యం షాపు ఎక్కడ

Viral Video: మందుబాబులకు తలతిరిగిపోయే సమాధానమిచ్చిన ఆవు..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Funny Video
Follow us
uppula Raju

|

Updated on: Sep 13, 2021 | 3:32 PM

Funny Video: మందుబాబులు ఉన్నట్టుండి ఎక్కడికైనా వెళితే ముందుగా ఆ ప్రాంతంలో మద్యం కోసం వెతుకుతారు. అక్కడ కనిపించిన వారందరిని ఇక్కడ మద్యం షాపు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తారు. చివరకు ఏదో ఒక విధంగా వారి గమ్యాన్ని చేరుకుంటారు. అయితే తాజాగా మందుబాబులకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.

ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు కారులో గుంతల రోడ్డు గుండా ప్రయాణించడం మనం చూడవచ్చు. వీడియోలో జరుగుతున్న సంభాషణ ద్వారా కారులో ఉన్న వ్యక్తులు మద్యం షాపు కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎవరినైనా అడుగుదామంటే రోడ్డు గుండా ఒక్క మనిషి కూడా కనిపించడు. సరిగ్గా అదే సమయంలో ఓ ఆవుల మందా వారికి ఎదురుపడుతుంది. అందులో ఒక ఆవు వీరి కారు పక్క నుంచి వెళుతుంటుంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారు ఆపి మద్యం షాపునకు దారెటు అని ఆవును అడుతుతాడు. వెంటనే ఆవు ఇటువైపే అన్నట్లు తల ఊపుతుంది. దీంతో మందుబాబులు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆవు తరచుగా మద్యంషాపునకు వెళుతుందో ఏమో అన్నట్లు చమత్కరించారు. మరికొంతమంది మందుబాబులకు చివరకు ఆవే దిక్కయిందని రాశారు. ఇంకొందరు ఆవు భలే సమాధానం చెప్పిందని మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్‌ చేస్తుండటం విశేషం.

View this post on Instagram

A post shared by Vipul Mittal (@vittyvipul)

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు!

Corona Third Wave: కరోనా మూడోవేవ్ నిజంగా ప్రారంభం అయిందా? ఆ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు దీనికి సంకేతమా?

Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!