Cycle Movie: బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి సర్ఫ్రైజ్.. సంక్రాంతి కానుకగా రానున్న ‘సైకిల్’..
బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం, మహత్ రాఘవేంద్ర, శ్వేతావర్మ, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సైకిల్. గ్రే మీడియా బ్యానర్
బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం, మహత్ రాఘవేంద్ర, శ్వేతావర్మ, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సైకిల్. గ్రే మీడియా బ్యానర్ పై ఓవరసీస్ నెట్వర్క్ ఎంటర్ టైన్మెంట్, విజయా ఫిలింస్, ఓంశ్రీమణికంఠ ఫిలింస్ కలిసి ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఆట్ల అర్జున్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తాజాగా సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ రెడ్డి మాట్లాడుతూ.. “కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. సంక్రాంతికి మంచి కుటుంబ ప్రేమ కథ చిత్రాన్ని చూసిన అనుభూతిని పొందుతారు. హీరోహీరోయిన్లతోపాటు అందురూ చాలా బాగా నటించారు. సంక్రాంతికి పెద్ద సినిమాలతోపాటు పోటిలో మా సినిమా కూడా ఉంది. ఇది కచ్చితంగా భిన్నమైన చిత్రంగా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేయడంలో డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు. మా సినిమాలు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకోచ్చారు.
Also Read: నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..