AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ – 5 డేట్ ఫిక్స్ అయిందా? నెల రోజులు గడవక ముందే మొదలైన సందడి.. స్టార్ మా ఏం చెబుతుందో తెలుసా..

బిగ్‌బాస్ మొదలైందంటే చాలు అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఈ షోపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతీయ

బిగ్‌బాస్ - 5 డేట్ ఫిక్స్ అయిందా? నెల రోజులు గడవక ముందే మొదలైన సందడి.. స్టార్ మా ఏం చెబుతుందో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 28, 2021 | 5:23 AM

Share

బిగ్‌బాస్ మొదలైందంటే చాలు అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఈ షోపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. తెలుగులోనూ బిగ్‌బాస్ హవా కొనసాగుతోంది. ఈ మధ్యనే బిగ్‌బాస్4 సీజన్ పూర్తయింది. ఇప్పుడు బిగ్‌బాస్ – 5 సీజన్‌ ప్రారంభంకాబోతుంది. 20 మందిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ ఇంటిలో ఉంచి గేమ్స్ ఆడిపించడమే ఈ షో ముఖ్య ఉద్దేశ్యం.

స్టార్ మా బిగ్‌బాస్ 5 సీజన్‌కు కసరత్తు ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. బిగ్‌బాస్-5 సీజన్‌కు కూడా హోస్ట్‌గా నాగార్జుననే వ్యవహరించనున్నారు. బిగ్‌బాస్ 3, 4 సీజన్స్ లో నాగార్జున తనదైన శైలిలో అటు హౌస్ మెంట్స్‌ని, ఇటు వీక్షకులను ఆకట్టున్నారు.

ఈ కారణంలో బిగ్‌బాస్ నిర్వాహకులు సీజన్ 5కి కూడా ఆయననే హోస్ట్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈసారి పాల్గొనే హోస్ట్‌కు, కంటెస్టెంట్‌కు భారీ మొత్తంలో నజరానా ఇవ్వడానికి బిగ్‌బాస్ రెడీ అయినట్లు తెలిసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రేండింగ్‌లో ఉన్న ఆరుగురిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహకులు సెలక్ట్ చేశారనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. 5వ సీజన్ కోసం దూకుడు ప్రదర్శిస్తున్న నిర్వహకులు అన్నీ కుదిరితే ఆగస్టు నెల చివరి ఆదివారం (29న) షోను ప్రారంభిచేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై బిగ్ బాస్ టీం త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయబోతోందని సమాచారం.

పీఆర్‌సీ నివేదికపై నిరాశ వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. ప్రభుత్వాన్ని మెప్పించి ప్రయోజనాలు సాధిస్తామంటున్న నేతలు

Follow Us
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్