Bigg Boss 4 : ఆ ఇద్దరు హౌస్‌మేట్స్ పై కౌంటర్లు వేసిన కుమార్ సాయి.. నవ్వుతూనే పగతీర్చుకున్న కుమార్ సాయి పగతీర్చుకున్నాడా..?
బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో ఈ సీజన్ పూర్తికానుంది. టాప్ 5లో అభిజీత్, హారిక అఖిల్ , సోహెల్, అరియానా ఉన్నారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అవ్వనున్నారు.

బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో ఈ సీజన్ పూర్తికానుంది. టాప్ 5లో అభిజీత్, హారిక అఖిల్ , సోహెల్, అరియానా ఉన్నారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అవ్వనున్నారు. ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక హౌస్ లో ఇన్ని రోజులు ప్రేక్షకుల సపోర్ట్ తో ఈ ఐదుగురు ఫైనల్ కు చేరుకున్నారు. ఐతే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తిరిగి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి అఖిల్ కు హారికపైన నవ్వుతూనే పగ తీర్చుకున్నాడని అర్ధమవుతుంది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఇది చూపించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి గేమ్ బాగానే ఆడాడు. కానీ అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. అయితే హౌస్ లో ఉన్నసమయంలో అఖిల్, హారిక తో కుమార్ సాయికి పెద్దగొడవే జరిగింది. అయితే ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన కుమార్ సాయి. ముందుగా హారికా పైన పంచ్ వేసాడు. నువ్వు సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేస్తావ్ అన్నాడు. ‘నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదనిలాంటి సిల్లీ రీజన్ చెప్పావ్’ అంటూ పంచ్ వేసాడు. ఇక అఖిల్ తో నీకు నాకు ఇష్టమైనది ఒకటుంది తెలుసా అంటూ పులిహోర అని గట్తిగానే ఇచ్చేసాడు. ఈ సంభాషణంతా సరదాగానే సాగిందని తెలుస్తుంది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏంజరుగుతుందో చూడాలి.
