AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను పెళ్లి చేసుకునే వాడు కచ్చితంగా అలాంటి వాడై ఉండాలి.. మనసులో మాట బయటపెట్టిన అందాల భామ రకుల్ ప్రీత్.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళుతోన్న రకుల్ ఇటీవల ప్రముఖ పెళ్లి పత్రిక ఖుష్ వెడ్డింగ్ కవర్ పేజీ కోసం ఫొటో షూట్ ఇచ్చారు. ఈ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. రకుల్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ..

నన్ను పెళ్లి చేసుకునే వాడు కచ్చితంగా అలాంటి వాడై ఉండాలి.. మనసులో మాట బయటపెట్టిన అందాల భామ రకుల్ ప్రీత్.
Narender Vaitla
|

Updated on: Dec 18, 2020 | 9:55 PM

Share

rakul talk about her dream man: ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. తన అందం, అభినయంతో సినీ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ చిన్నది అనతి కాలంలో బడా హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళుతోన్న రకుల్ ఇటీవల ప్రముఖ పెళ్లి పత్రిక ఖుష్ వెడ్డింగ్ కవర్ పేజీ కోసం ఫొటో షూట్ ఇచ్చారు. ఈ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. రకుల్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ‘నేను చేసుకోబోయే వాడికి కచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో ప్రాధానమైంది… అతనికి జీవితం పట్ల మంచి అభిరుచి ఉండాలి. నేను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను సైన్యం నేపథ్యంలో పెరిగాను. కాబట్టి నాకు కాబోయే వాడు కచ్చితంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండే వ్యక్తి అయ్యి ఉండాలి. ఇక నా పెళ్లిని కేవలం 100 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని ఉంది. నా పెళ్లిని బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లా చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చిందీ చిన్నది. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రంలో అర్జున్ కపుర్‌తో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలొ రకుల్ తొలిసారి డీగ్లామర్ పాత్రలో నటించనుంది. ఇందులో రకుల్ ఒక గోర్ల కాపరి పాత్రలో కనిపించనుంది. మరి డీగ్లామర్ పాత్రలో రకుల్ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.