Bigg Boss 4: హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జానీ మాస్టర్‌

బుల్లితెరపై బిగ్‌బాస్ 4 నాలుగో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్‌కి మరోసారి అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా కనిపించబోతున్నారు.

Bigg Boss 4: హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జానీ మాస్టర్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 4:14 PM

Bigg Boss 4 Telugu: బుల్లితెరపై బిగ్‌బాస్ 4 నాలుగో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్‌కి మరోసారి అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా కనిపించబోతున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ సీజన్‌ని నిర్వాహకులు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సారి హౌజ్‌లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారన్న చర్చ ప్రేక్షకుల మధ్య నడుస్తోంది. అలాగే కరోనా నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్ షో ఎలా ఉండబోతోంది..? ఎంటర్‌టైన్‌ తగ్గించకుండా నిర్వాహకులు ఎలా ప్లాన్ చేశారని అందరిలో చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ షోలోకి తాను ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే డ్యాన్స్ మాస్టర్ రఘు కన్ఫర్మ్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం మరో డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆయనతో సంప్రదింపులు జరపడం, ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే షో ప్రారంభం అయ్యే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో మొత్తం 12 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనబోతుండగా.. 70 రోజుల పాటు షో ఉండనున్నట్లు సమాచారం.

Read More:

‘మేల్ ప్రెగ్నెన్సీ’పై బాలీవుడ్‌లో సినిమా.. హీరో ఎవరంటే!

అధికారిక ప్రకటన: సుక్కు సమర్పణలో ధరమ్‌ తేజ్‌ థ్రిల్లర్ మూవీ