మహేష్‌కి కూడా ఓకే చెప్పారా..!

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

  • Publish Date - 2:59 pm, Tue, 14 July 20 Edited By:
మహేష్‌కి కూడా ఓకే చెప్పారా..!

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. సర్కారు వారి పాట అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటీనటులను ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నారు పరశురామ్. ఇందులో భాగంగా ఇప్పటికే హీరోయిన్‌గా కీర్తిని ఫైనల్ చేసిన ఈ దర్శకుడు, మిగిలిన పాత్రల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ క్రమంలో ఇందులో మహేష్ తల్లి పాత్ర కోసం బాలీవుడ్ నటి భాగ్య శ్రీ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరపడం, ఇందులో నటించేందుకు భాగ్యశ్రీ ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా రాధే శ్యామ్ చిత్రంలో భాగ్యశ్రీ, ప్రభాస్ తల్లిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు. క్రేజీ కాంబోగా తెరకెక్కబోతున్న ఈ మూవీపై అటు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.